నాయిని అంత్యక్రియల్లో జేబు దొంగల చేతివాటం

నాయిని అంత్యక్రియల్లో జేబు దొంగల చేతివాటం

హైదరాబాద్: మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను కుటుంబసభ్యులు నిర్వహించారు. అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు. ఇదిలా ఉంటే. తమ ప్రియతమ నేతను కొల్పోయినందుకు కార్యకర్తలు కన్నీటి పర్యంతమవుతుండగా.. దీన్ని అవకాశంగా తీసుకున్న జేబు దొంగలు రెచ్చిపోయారు. నాయిని అంత్యక్రియల్లో పోలీసుల కళ్లు గప్పి చేతివాటం ప్రదర్శించారు. నాయినికి కడసారి వీడ్కోలు పలికేందుకు వేలాది టీఆర్‌ఎస్ నేతలతో పాటు ఆయనతో కలిసి పనిచేసిన నేతలు వచ్చారు.

అయితే నరసింహారెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నేతలు భావోద్వేగానికి గురయ్యాయి. ఇంతటి దు:ఖ సమయంలోనూ జేబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. పలువురు టీఆర్‌ఎస్ నేతల జేబుల్లో ఉన్న నగదు కొట్టేసి తమ జేబుల్లోకి సర్ధుకున్నారు. అయితే ఓ నేత జేబులో నుంచి నగదును తీస్తుండగా అడ్డంగా బుక్కయ్యాడు. ఇంకేముంది ఆ దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు నేతలు.