బాలీవుడ్ స్టార్ గోవింద మంగళవారం ( అక్టోబర్1, 2024) ఉదయం ప్రమాదవశాత్తు తన సొంత లైసెన్స్ డ్ గన్ మిస్ ఫైర్ తో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.. గన్ క్లీన్ చేస్తుండగా..మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్ అతని ఎడమ మోకాలి బోన్ కు తగిలింది..దీంతో గోవింద అతని సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
గోవింద ప్రస్తుతం జుహూలోని క్రిటి కేర్ హాస్పిటల్ లోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. గన్ షాట్ కారణంగా గోవిం దకు తీవ్ర రక్తస్రావం అయింది. డాక్టర్లు సర్జరీ చేసి కాలి నుంచి బుల్లెట్ ను తొలగించాలి. గోవిందాకు ప్రాణ భయం ఏమీలేదని, త్వరలో డిశ్చార్జ్ చేస్తామని ఆపరేషన్ చేసిన డాక్టర్లు చెప్పారు. గోవింద లెగ్ పోస్ట్ సర్జరీ నుంచి తొలగించిన బుల్లెట్ ఫొటోను కూడా డాక్టర్లు షేర్ చేశారు.
Also Read :- పని ఒత్తిడి పెరుగుతుందా?..తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు
మంగళవారం ఉదయం 4.45 గంటల సమయంలో గోవింద ముంబై నుంచి కోల్ కతా వెళ్లేందుకు సిద్దమవుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. తన లైసెన్స్ డ్ రివాల్వర్ క్లీన్ చేస్తుండగా కిందపడి బుల్లెట్ మోకాలి లోకి దూసుకెళ్లింది. గోవిందా సిబ్బంది అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
అయితే గోవిందాను చేసేందుకు అతని భార్య కాష్మేరా షా హుటాహుటిన ఆస్పత్రికి వచ్చారు. గత కొంతకాలంగా కాష్మేరా షా కు, గోవిందా దూరంగా ఉంటున్నారు. మరోవైపు జుహూలో చికిత్స పొందుతున్న గోవిందాను పలువురు రాజకీయ నాయకులు, మాజీ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ పరామర్శించారు.