వేరుశనగ కుప్పకు నిప్పు పెట్టిన్రు

వేరుశనగ కుప్పకు నిప్పు పెట్టిన్రు

లింగాల, వెలుగు: మండలంలోని కోమటికుంట గ్రామానికి చెందిన చెందిన గడ్డం కాశన్నకు చెందిన వేరుశనగ కుప్పకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కాశన్న మూడెకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. వేరుశనగ పట్టించి  పొలంలో నిల్వ చేశాడు.

శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కుప్పలపై కవర్  కప్పి ఇంటికి వచ్చేశాడు. 9 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు వేరుశనగతో పాటు పక్కనే ఉన్న పొట్టుకు నిప్పు పెట్టడంతో మంటలు వచ్చాయి. చుట్టుపక్కల రైతులు గమనించి కాశన్నకు సమాచారం అందించారు. తోటి రైతుల సాయంతో మంటలు ఆర్పినప్పటికీ అప్పటికే పూర్తిగా కాలిపోయాయి. 30 క్వింటాళ్ల వేరుశనగ కాలిపోయిందని, రూ.2.50 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.