పిల్లోతో పింపుల్స్?

పిల్లోతో పింపుల్స్?

బ్యూటీ ప్రొడక్ట్స్‌‌ ఎక్కువగా వాడుతున్నా ... అందుకే మొటిమలు, రాషెస్ ఎక్కువగా వస్తున్నాయి కాబోలు అనుకుంటారు కొంతమంది. అయితే బ్యూటీ ప్రొడక్ట్స్‌‌ ఒక్కటే అందుకు కారణం కాదు. దిండు కవర్లు, హెవీ వర్క్‌‌అవుట్స్‌‌, నిద్రలేమి, మొబైల్‌‌ ఫోన్‌‌ కూడా కారణమే అంటున్నారు స్కిన్‌‌ ఎక్స్‌‌పర్ట్స్‌‌. అదెలాగంటే..

పిల్లో కవర్స్‌‌ వల్ల స్కిన్‌‌ ఎలా పాడవుతుంది అంటే... దుమ్ము, జుట్టుకు ఉన్న ఆయిల్, ముఖం పైన ఉండే డెడ్‌‌ స్కిన్ సెల్స్‌‌ అన్నీ పిల్లో కవర్‌‌‌‌ మీద చేరతాయి. దాంతో అక్కడ బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఇంకేముంది... ఆ పిల్లో మీద పడుకున్నపుడు బ్యాక్టీరియా ముఖానికి అంటుకొని చర్మం పాడవుతుంది. ఎక్సర్‌‌‌‌సైజ్‌‌లు ఎక్కువగా చేయడం వల్ల శరీరం నుండి టాక్సిన్స్​ చెమట రూపంలో బయటికి వస్తాయి. అవి ముఖానికి హాని చేసి పింపుల్స్‌‌కు కారణం అవుతాయి. నిద్ర సరిపడా లేకపోతే స్ట్రెస్‌‌కు కారణం అవుతుంది. స్ట్రెస్‌‌ వల్ల కూడా ముఖం పాడవుతుంది. దానివల్ల ముఖంపై ముడతలు ఏర్పడతాయి. అందుకే రోజుకు 7–8 గంటల నిద్ర అవసరం. మంచి డైట్‌‌ను తీసుకోవడం వల్ల హెల్త్‌‌, స్కిన్‌‌ రెండూ బాగుంటాయి. ఫుడ్‌‌లో ఆకుకూరలు, నట్స్‌‌, ఫైబర్‌‌,‌‌ విటమిన్‌‌–సి ఎక్కువగా ఉండే పళ్లు ఉండాలి. ఇవి తినడం వల్ల స్కిన్‌‌ మెరుస్తుంది. ఫోన్‌‌ స్క్రీన్‌‌ మీద ఎన్నో రకాల బ్యాక్టీరియా, వైరస్‌‌లు ఉంటాయి. ఫోన్‌‌ మాట్లాడేటప్పుడు స్క్రీన్‌‌ ముఖానికి తాకడం వల్ల స్కిన్‌‌ ప్రాబ్లమ్స్‌‌ వస్తాయి. ఫోన్‌‌ స్క్రీన్‌‌ను ఆల్కహాల్‌‌ వైప్స్‌‌తో క్లీన్ చేయాలి

ఇవి కూడా చదవండి: 

కాషాయం కండువాలతో క్యాంపస్‌కు విద్యార్థులు

హిజాబ్ ధరించిన విద్యార్థులకు అనుమతి