కేసీఆర్​తో రోహిత్​రెడ్డి భేటీ

కేసీఆర్​తో రోహిత్​రెడ్డి భేటీ

హైదరాబాద్​, వెలుగు:  తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌‌ రోహిత్‌‌ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌‌కు వెళ్లి సీఎం కేసీఆర్​ను కలిశారు. రెండు రోజులపాటు జరిగిన ఈడీ విచారణ గురించి ఆయన సీఎంకు తెలిపినట్లు సమాచారం.  ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, కొన్నేళ్లుగా తనతో పాటు తన కుటుంబ సభ్యుల బ్యాంక్‌‌ లవాదేవీలు, వ్యాపార లావాదేవీల గురించి ఈడీ ప్రశ్నలు అడిగిందని రోహిత్​రెడ్డి చెప్పినట్లు తెలిసింది.

ఈ నెల 27న మరోసారి విచారణకు రావాలని ఈడీ సూచించిందని చెప్పారు. ఈడీ కోరిన వివరాలపై లీగల్‌‌ ఎక్స్‌‌పర్ట్‌‌ల సలహాలు తీసుకుందామని, దాన్ని బట్టి విచారణకు హాజరుకావాలని కేసీఆర్‌‌ సూచించినట్లు తెలిసింది.  మంగళవారం వరకు అయ్యప్ప మాలలో ఉన్న పైలెట్‌‌ రోహిత్‌‌ రెడ్డి.. తమ సమీప బంధువు మృతిచెందడంతో బుధవారం మాలను తీసేశారు