ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా, విస్తారా విలీనంపై.. పైలెట్లు అసంతృప్తి

ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా, విస్తారా విలీనంపై.. పైలెట్లు అసంతృప్తి

సోమవారం నుంచి విలీనం అమల్లోకి


న్యూఢిల్లీ: ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా, విస్తారా విలీనంపై  కొంత మంది ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా పైలెట్లు అసంతృప్తిగా ఉన్నారు.  ఎయిర్ ఇండియాలో పైలెట్ల రిటైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఏజ్ 58 ఏళ్లు కాగా, విస్తారాలో ఇది 60 ఏళ్లు ఉంది. ఈ రెండు టాటా గ్రూప్ కంపెనీల్లో వేరు వేరు  రిటైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఏజ్‌‌‌‌‌‌‌‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు.  ఎయిర్ ఇండియా, విస్తారా విలీనం కాకముందు ఈ సమస్యను మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పరిష్కరించలేదని కొంత మంది పైలెట్లు చెబుతున్నారు. ఈ అంశంపై ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా స్పందించలేదు. టాటా గ్రూప్‌‌‌‌‌‌‌‌, సింగపూర్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ల జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విస్తారా  సోమవారం ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియాలో విలీనం కానుంది.