పింక్‌ టెస్ట్‌ పాసయ్యేదెవరు? నేటి నుంచి ఇండియా, ఇంగ్లండ్‌ డే/నైట్‌ మ్యాచ్​

పింక్‌ టెస్ట్‌ పాసయ్యేదెవరు? నేటి నుంచి ఇండియా, ఇంగ్లండ్‌ డే/నైట్‌ మ్యాచ్​
  • గెలుపే లక్ష్యంగా ఇరుజట్లు బరిలోకి
  • బుమ్రా, ఉమేశ్‌ రీ ఎంట్రీ!

అహ్మదాబాద్‌‌‌‌: చెన్నై టెస్ట్‌‌ మ్యాచ్‌‌లను సక్సెస్‌‌ఫుల్‌‌గా కంప్లీట్‌‌ చేసిన టీమిండియా అతిపెద్ద సవాల్‌‌కు సిద్ధమైంది. పెద్దగా ఎక్స్‌‌పీరియెన్స్‌‌ లేని డే/నైట్‌‌ టెస్ట్‌‌లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యింది. రీ కన్‌‌స్ట్రక్ట్‌‌ చేసిన వరల్డ్‌‌ లార్జెస్ట్‌‌ స్టేడియం మొతెరాలో నేటి (బుధవారం) నుంచి జరిగే పింక్‌‌ బాల్‌‌ (థర్డ్‌‌ టెస్ట్‌‌) మ్యాచ్‌‌లో పటిష్టమైన ఇంగ్లండ్‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. నాలుగు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో ప్రస్తుతం ఇరుజట్లు 1–1తో సమంగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్‌‌లో గెలిచి సిరీస్‌‌ను ఇక్కడే సొంతం చేసుకోవాలని రెండు జట్లు టార్గెట్‌‌గా పెట్టుకున్నాయి. అయితే ఈ రెండు జట్లను భయపెడుతున్న అతిపెద్ద అంశం మరోటి ఉంది. అదే ప్రతిష్టాత్మక వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్​కు క్వాలిఫై కావడం. లాస్ట్‌‌ రెండు మ్యాచ్‌‌లో ఇండియా కనీసం ఒక్కదాంట్లోనైనా గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్​కి అర్హత సాధిస్తుంది. అదే ఇంగ్లండ్‌‌ అయితే రెండు మ్యాచ్‌‌ల్లోనూ గెలవాలి. కాబట్టి ఇరుజట్లపై చాలా ఒత్తిడి నెలకొని ఉన్న నేపథ్యంలో.. పింక్‌‌ టెస్ట్ ఇండియా, ఇంగ్లండ్‌‌కు కఠిన పరీక్షగా మారింది.

బుమ్రా, ఉమేశ్‌‌ ఇన్‌‌..

ఈ మ్యాచ్‌‌ కోసం టీమిండియా రెండు మార్పులు చేసే చాన్స్‌‌ ఉంది. బ్యాటింగ్‌‌లో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా.. బౌలింగ్‌‌ బలం పెంచాల్సిన అవసరం చాలా ఉంది. మంచు ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల స్ట్రాటజీకి కోహ్లీ ఓటేస్తున్నాడు. దీంతో బుమ్రా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. సెకండ్‌‌ పేసర్‌‌గా ఇషాంత్‌‌ , థర్డ్‌‌ పేసర్‌‌ ప్లేస్‌‌ కోసం ఉమేశ్‌‌, సిరాజ్‌‌ మధ్య పోటీ నెలకొంది. అయితే హోమ్‌‌ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను దృష్టిలో పెట్టుకుని ఉమేశ్‌‌ను తీసుకునే చాన్సెస్‌‌ ఎక్కువగా ఉన్నాయి. పేస్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ అనుకుంటే హార్దిక్‌‌కు కూడా చాన్స్‌‌ దక్కొచ్చు.   స్పిన్నర్లుగా అశ్విన్‌‌, అక్షర్‌‌ ఖాయం. రిస్ట్‌‌ స్పిన్నర్‌‌ కుల్దీప్‌‌ బెంచ్‌‌కు పరిమితం కానున్నాడు. ఓపెనింగ్‌‌లో రోహిత్‌‌, గిల్‌‌ శుభారంభాన్నిస్తే.. సగం మ్యాచ్‌‌ గెలిచినట్లే. పుజారా, కోహ్లీ, రహానెలో ఏ ఒక్కరు నిలబడ్డా భారీ స్కోరును ఎక్స్‌‌పెక్ట్‌‌ చేయొచ్చు. పంత్‌‌ మరోసారి మెరిస్తే మ్యాచ్‌‌ మనదే.

కొత్త పిచ్.. నో అడ్వాంటేజ్‌‌‌‌

ఎన్నో క్రికెటింగ్‌‌ ఫీట్స్‌‌కు సాక్ష్యంగా నిలిచిన పాత మొతెరాను కంప్లీట్‌‌గా రీ కన్‌‌స్ట్రక్ట్‌‌ చేశారు. దీంతో కొత్త పిచ్‌‌లు ఎలా స్పందిస్తాయనే దానిని ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. కాబట్టి టీమిండియాకు హోమ్‌‌ అడ్వాంటేజ్‌‌ పెద్దగా ఉండదనేది విశ్లేషకుల వాదన. అయితే హిట్‌‌మ్యాన్‌‌ రోహిత్‌‌ మాత్రం కచ్చితంగా టర్నింగ్‌‌ సర్ఫెస్‌‌ అని చెబుతున్నాడు. అదే జరిగితే అశ్విన్‌‌, అక్షర్‌‌ పటేల్‌‌ మరోసారి ఇంగ్లండ్‌‌ను దెబ్బతీయడం ఖాయం.

ట్విలైట్‌‌‌‌తోనే కష్టం..

పింక్‌‌ బాల్‌‌ టెస్ట్‌‌లన్నీ లక్కీ లాటరీలాంటివి. ట్విలైట్‌‌ (సూర్యాస్తమయ సమయం)లో ఎవరు బాగా ఆడతారనే దానిపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే బ్యాట్స్‌‌మన్‌‌ ఆర్టిఫిషియల్‌‌ లైట్స్‌‌కు అడ్జెస్ట్‌‌ అవ్వాల్సి ఉంటుంది. సరిగ్గా అదే టైమ్‌‌లో ఫ్లడ్‌‌లైట్స్‌‌ వెలుతురులో పింక్‌‌ బాల్‌‌ స్వింగ్‌‌, సీమ్‌‌ రెట్టింపవుతుంది. సాధారణ మ్యాచ్‌‌ల్లో రెడ్‌‌బాల్‌‌తో ఇలా జరగదు. పిచ్‌‌ మీద గ్రాస్‌‌, అవుట్‌‌ ఫీల్డ్‌‌లో మంచు లేనప్పుడు కూడా బాల్‌‌ ఇలాగే స్వింగ్‌‌ అయితే మాత్రం బ్యాట్స్‌‌మన్‌‌ కష్టాలు డబుల్‌‌ అవుతాయి.

రూట్‌‌‌‌పైనే భారం

ఈ మ్యాచ్‌‌ కోసం ఇంగ్లండ్‌‌  మూడు మార్పులు చేయనుంది. బర్న్స్‌‌ ప్లేస్‌‌లో యంగ్‌‌ క్రికెటర్‌‌ జాక్‌‌ క్రాలీ ఓపెనింగ్‌‌ చేయనున్నాడు. మూడో స్థానంలో లారెన్స్‌‌ ప్లేస్‌‌లో బెయిర్‌‌స్టో రాక ఖాయమైంది. ఇక స్పిన్నర్లుగా జాక్‌‌ లీచ్‌‌తో కలిసి డామ్‌‌ బెస్‌‌ బాధ్యతలు పంచుకునే చాన్స్‌‌ ఉంది.  అయితే పిచ్‌‌ను బట్టి దీనిపై ఫైనల్‌‌ డెసిషన్‌‌ తీసుకోనున్నారు. వర్క్‌‌లోడ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌లో భాగంగా బ్రాడ్‌‌ ప్లేస్‌‌లో ఆర్చర్‌‌, మార్క్‌‌ వుడ్‌‌, అండర్సన్‌‌లలో ఇద్దరు ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో ఉండనున్నాడు. మొయిన్‌‌ అలీ బెంచ్‌‌కు పరిమితం కానున్నాడు. లాస్ట్‌‌ రెండు మ్యాచ్‌‌లను పరిశీలిస్తే ఇంగ్లండ్‌‌ బ్యాటింగ్‌‌ భారం మొత్తం కెప్టెన్‌‌ రూట్‌‌పైనే ఆధారపడి ఉంది. టాప్‌‌ ఆర్డర్‌‌లో సిబ్లీ, క్రాలీ, బెయిర్‌‌స్టో చెలరేగితే ఇండియాకు ఇబ్బందులు తప్పవు. మిడిలార్డర్‌‌లో ఆల్‌‌రౌండర్‌‌ స్టోక్స్‌‌ చాలా కీలకం కానున్నాడు. పోప్‌‌, ఫోక్స్‌‌తో బ్యాటింగ్‌‌ డెప్త్‌‌ పెరగడం ఇంగ్లండ్‌‌కు అనుకూలాంశం.

బౌలింగ్‌‌‌‌ అటాక్‌‌పై క్లారిటీ లేదు

ఈ గ్రౌండ్‌‌ గురించి, ఇండియా పింక్‌‌ బాల్‌‌ ఆడటంపై మాకు లిమిటెడ్‌‌ ఇన్ఫర్మేషన్‌‌ మాత్రమే ఉంది. అందుకే బౌలింగ్‌‌ కాంబినేషన్‌‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. మ్యాచ్‌‌కు ముందు ఉండే కండీషన్స్‌‌ను బట్టి దీనిపై ​ డెసిషన్‌‌ తీసుకుంటాం. ఆర్చర్‌‌ రావడం మాకు అనుకూలాంశమే. ఈ మ్యాచ్‌‌లో కచ్చితంగా ప్రభావం చూపిస్తాడు.  ఏదేమైనా పిచ్‌‌ను బట్టే మా ప్లాన్స్‌‌ ఉంటాయి.  కీలకమైన మ్యాచ్‌‌ కావడం, బాల్‌‌ ఎక్కువగా స్వింగ్‌‌ అయ్యే చాన్స్‌‌ ఉండటంతో అండర్సన్‌‌తో పాటు బ్రాడ్‌‌ను కూడా తీసుకునే అవకాశం లేకపోలేదు.

‑  రూట్​ ఇంగ్లడ్​ కెప్టెన్​

రికార్డులకు చేరువలో పలువురు

స్వదేశంలో అత్యధిక టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌ విజయాలు సాధించిన ఇండియన్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా రికార్డులకెక్కడానికి కోహ్లీకి అవసరమైన విక్టరీల సంఖ్య 1. ప్రస్తుతం కోహ్లీ, ధోనీ 21 విజయాలతో సమానంగా ఉన్నారు.

మరో ఆరు వికెట్లు తీస్తే అశ్విన్‌‌‌‌ 400 క్లబ్‌‌‌‌లో చేరతాడు. ఇండి యా తరఫున ఫోర్త్‌‌‌‌ బౌలర్‌‌‌‌గా రికార్డు సృష్టిస్తాడు.

పింక్‌‌‌‌ బాల్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో ఉమేశ్‌‌‌‌ యాదవ్‌‌‌‌ తీసిన వికెట్లు 11. 14 వికెట్లతో ఆండర్సన్‌‌‌‌ ఈ లిస్ట్‌‌‌‌లో ఇండియన్‌‌‌‌ పేసర్‌‌‌‌ కంటే ముందున్నాడు.

టెస్ట్‌‌‌‌ల్లో 2500 రన్స్‌‌‌‌ కంప్లీట్‌‌‌‌ చేయడానికి రోహిత్‌‌‌‌కు అవసరమైన పరుగులు 25.

2019 ఈడెన్‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌తో జరిగిన పింక్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో కోహ్లీ సెంచరీ కొట్టాడు.  ఆ తర్వాత 34 ఇన్నింగ్స్‌‌‌‌లు ఆడినా ట్రిపుల్‌‌‌‌ మార్క్‌‌‌‌ను అందుకోలేదు. తన కెరీర్‌‌‌‌లో ఇదే లాంగెస్ట్‌‌‌‌ గ్యాప్‌‌‌‌.

టెస్ట్‌‌‌‌ల్లో 7500 రన్స్‌‌‌‌ పూర్తి చేయడానికి విరాట్‌‌‌‌కు అవసరమైన పరుగులు 37. 89 టెస్ట్‌‌‌‌ల్లో 52 యావరేజ్‌‌‌‌తో 7463 రన్స్‌‌‌‌తో ఉన్నాడు.

ఇషాంత్‌‌‌‌కు ఇది వందో టెస్ట్‌‌‌‌. ఇండియా తరఫున ఈ ఫీట్‌‌‌‌ అందుకోనున్న సెకండ్‌‌‌‌ ఫాస్ట్‌‌‌‌ బౌలర్‌‌‌‌. కపిల్‌‌‌‌ దేవ్‌‌‌‌ (131) ముందున్నాడు.

ఇప్పటివరకు జరిగిన 15 పింక్‌‌‌‌ బాల్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ల్లో ఫాస్ట్‌‌‌‌ బౌలర్లు పడగొట్టిన వికెట్ల సంఖ్య 354. స్పిన్నర్లు 115 వికెట్లు తీశారు.

మొతెరాలో ఆడిన లాస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ ఇండియా, ఇంగ్లండ్‌‌‌‌ మధ్య 2012లో జరిగింది. ఆ మ్యాచ్‌‌‌‌లో పుజారా 206 (నాటౌట్‌‌‌‌), 41 (నాటౌట్‌‌‌‌) రన్స్‌‌‌‌ చేయడంతో ఇండియా 9 వికెట్ల తేడాతో గెలిచింది.

ఒక్క టెస్ట్‌‌‌‌ గెలిస్తే.. అత్యధిక విజయాలు సాధించిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌‌గా రూట్‌ రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం 26 విక్టరీలతో వాన్‌‌తో సమంగా ఉన్నాడు.

జట్లు (అంచనా)

ఇండియా: కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌, గిల్‌, పుజారా, రహానె, పంత్‌, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, ఇషాంత్‌, ఉమేశ్‌, బుమ్రా.

ఇంగ్లండ్‌: రూట్‌ (కెప్టెన్‌), సిబ్లే, క్రాలీ, బెయిర్‌స్టో, స్టోక్స్‌, పోప్‌, ఫోక్స్‌, బెస్‌ / వోక్స్‌, ఆర్చర్‌, లీచ్‌, అండర్సన్‌.

పిచ్‌, వాతావరణం: పిచ్‌పై లైవ్‌ గ్రాస్‌ ఉంది. ఫ్లడ్‌లైట్స్‌ వెలుతురులో న్యూబాల్‌తో పేసర్లు ప్రభావం చూపిస్తారు. మ్యాచ్‌ లాస్ట్‌ డేస్‌ స్పిన్నర్లకు అనుకూలం. వర్షం ముప్పు లేదు. 25 డిగ్రీ సెల్సియస్‌ టెంపరేచర్‌ ఉంటుంది. సాయంత్రం 10 డిగ్రీస్‌ డ్రాప్‌ అవుతుంది.

For More News..

సౌదీ చరిత్రలో మొదటిసారి.. ఆర్మీలోకి మహిళలు

సకల సౌకర్యాలతో మొతెరా అదుర్స్‌

స్టార్​ కంపెనీలుగా మారిన స్టార్టప్ కంపెనీలు