నుమాయిష్లో పిస్తా హౌస్ హాలిమ్

నుమాయిష్లో పిస్తా హౌస్ హాలిమ్

బషీర్​బాగ్, వెలుగు: నగర ప్రజలను నోరూరించే పిస్తా హౌస్ హాలిమ్ ఇప్పుడు నాంపల్లిలోని 85వ నుమాయిష్ (ఎగ్జిబిషన్)​లో స్టాల్ ఏర్పాటు చేసింది. ఈ స్టాల్​ను పిస్తా హౌస్ వ్యవస్థాపకుడు మజీద్ శనివారం ప్రారంభించారు. క్వాలిటీలో ఎలాంటి రాజీ లేకుండా హాలిమ్ అందిస్తామన్నారు. కాగా, నుమాయిష్ సందర్శకులకు గ్రేటర్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. 

సికింద్రాబాద్ స్టేషన్, దిల్​సుఖ్‌నగర్, ఎల్బీ నగర్, చార్మినార్, ఉప్పల్, రిసాలాబజార్, ఎన్జీవోస్ కాలనీ, జీడిమెట్ల, లింగంపల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, మెహదీపట్నం, చాంద్రాయణగుట్ట, మియాపూర్ నుంచి ఎగ్జిబిషన్​కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించింది. రోజూ సాయంత్రం 5 గంటల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.