మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు క్యూరేటర్ సూసైడ్

V6 Velugu Posted on Nov 08, 2021

అరబ్ గడ్డపై జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో విషాదం. అబుదాబి క్రికెట్ స్టేడియం చీఫ్ క్యురేటర్ గా పనిచేస్తున్న ఇండియన్ మోహన్ సింగ్ సూసైడ్ చేసుకున్నాడు. అఫ్గానిస్తాన్– న్యూజిలాండ్ మ్యాచ్ కు కొన్ని గంటల ముందు మోహన్ .. తన గదిలో సీలింగ్ కు ఉరి వేసుకున్నాడు.. ఉత్తరాఖండ్ కు చెందిన 45 ఏళ్ల మోహన్ కొన్నాళ్లుగా డిప్రెషన్ తో బాధపడుతున్నాడని యూఏఈ  క్రికెట్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. అఫ్గాన్ – కివీస్ మ్యాచ్ కోసం రెడీ చేసిన పిచ్ ను పరిశీలించిన తర్వాత గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాయి. మోహన్ మృతి పట్ల అబుదాబి క్రికెట్ ,ఇంటర్నేషనల్  క్రికెట్ కౌన్సిల్ సంతాపం వ్యక్తం చేశాయి. కానీ, తన మృతికి గల కారణాలను మాత్రం వెల్లడించడలేదు. మోహన్ ఫ్యామిలీ మెంబర్స్ ,గ్రౌండ్ స్టాఫ్ సపోర్ట్ తో మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరిగిందన్నాయి. 15 ఏళ్లుగా అబుదాబి క్రికెట్ త్ పనిచేస్తున్న మోహన్ కు భార్య ,కూతురు ఉన్నారు.

Tagged suicide, New Zealand, Afghanistan, Pitch Curator, Mohan Singh

Latest Videos

Subscribe Now

More News