పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలంటే అక్టోబర్ 10న ఇలా చేయండి...

పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలంటే అక్టోబర్ 10న ఇలా చేయండి...

 ఏకాదశి తిథికి  హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం 24 ఏకాదశి తిథులు వస్తాయి. ప్రతి ఒక్క ఏకాదశికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది. తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

బాధ్రపదమాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి( 2023, అక్టోబర్ 10) ని ఇందిరా ఏకాదశి అంటారు. ఈ సమయంలో పితృ పక్షాలను జరుపుకుంటారు. ఈ ఏకాదశిని పితృ పక్షాలలో జరుపుకోవడం వల్ల మోక్షానికి మార్గం సులభమవుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున( 2023, అక్టోబర్ 10)  పూర్వీకులను స్మరించుకుంటూ పూజలు చేయడం వల్ల వారికి విముక్తి లభించి.. వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. పూర్వీకుల విముక్తి కోసం ప్రతి ఒక్కరూ ఈ ఏకాదశి తిథి నాడు పూజలు చేయాలని పెద్దలు చెబుతారు. .. ఈ పవిత్రమైన రోజున( 2023, అక్టోబర్ 10) పాటించాల్సిన పరిహారాలు, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. . .

ఏకాదశి తిథి ముగింపు : 10 అక్టోబర్ 2023 మంగళవారం మధ్యాహ్నం 3:08 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం, ఇందిరా ఏకాదశిని అక్టోబర్ 10వ తేదీన మంగళవారం నాడు జరుపుకోనున్నారు. ఏకాదశి వత్రం తర్వాత మీ శక్తి, సామర్థ్యాల మేరకు బ్రాహ్మణులకు ఆహారం, పండ్లు, డబ్బులను దానం చేయాలి.

ఇందిరా ఏకాదశి ప్రాముఖ్యత..

ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు కచ్చితంగా లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. శాస్త్రోక్తంగా మీ పూర్వీకుల్లో ఎవరికైనా ఏదో ఒక కారణం వల్ల మోక్షం లభించకపోతే ఇందిరా ఏకాదశి వ్రతం చేసి దాని ద్వారా పొందిన పుణ్యాన్ని తమ పూర్వీకులకు దానం చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది. ఈరోజున ( 2023, అక్టోబర్ 10)పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధం, తర్పణం సమర్పించే వారికి పితృ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.

ఇందిరా ఏకాదశి రోజున ఏం చేయాలి..

  •  ఈ ఏకాదశి తిథి( 2023, అక్టోబర్ 10) నాడు పూర్వీకుల విముక్తిని కోరుకుంటూ దేవతల ముందు దీపం వెలిగించి, భగవద్గీతను చదవడం లేదా వినడం చేయాలి.
     
  • భగవద్గీత మొత్తం చదవడం సాధ్యం కాకపోతే, కనీసం ఏడో అధ్యాయమైనా చదవాలి లేదా వినాలి.
     
  • పూర్వీకుల విముక్తి కోరుకుంటూ దేవుడిని ఆరాధించాలి.
     
  •  సాయంత్రం వేళ తులసి చెట్టు ముందు నేతి దీపం వెలిగించాలి. ఆ తర్వాత పూర్వీకుల విముక్తి కోసం ప్రార్థించాలి.
     
  •  ఇందిరా ఏకాదశి రోజున రావి చెట్టు ఎదుట ఆవాల నూనెతో దీపాలు వెలిగించాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి కలగడంతో పాటు మనకు ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి.

ఇందిరా ఏకాదశి మంత్రాలు..

  •  ఓం నమో భాగవత వాసుదేవాయ నమః
     
  •  హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ హరే రామ్ రామ్ రామ్ హరే హరే.
     
  •  ఓం నమో నారాయాణాయ.. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి.
     
  • ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్
     
  • విష్ణు సహస్రనామం పఠించడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి. మీరు చేసే కార్యాలన్నీ కచ్చితంగా నెరవేరుతాయి.