- అక్టోబర్ 16న ప్రత్యేక కోటా సీట్ల భర్తీకి ప్రక్రియ
హైదరాబాద్, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను రెగ్యులర్, ప్రత్యేక కోటాల్లో మిగిలిన సీట్ల భర్తీకికౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు. రెగ్యులర్ కోటాలోని బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం మూడో దశ కౌన్సెలింగ్‌ను ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్టు చెప్పారు.
అలాగే ఇదే కోర్సుల్లో ప్రత్యేక కోటా కింద మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 16న కౌన్సెలింగ్ జరగనుందని పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌లోని యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్ వెల్లడించారు. ఖాళీ సీట్ల సంఖ్య, ఫీజుల వివరాలు, కౌన్సెలింగ్‌కు తెచ్చుకోవాల్సిన సర్టిఫికెట్లు, ఇతర మార్గదర్శకాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.pjtau.edu.in ను సందర్శించాలని సూచించారు.
