తెలుగు టైటాన్స్ ఇంటికి.. పుణెరి ఫైనల్‌‌‌‌కు

తెలుగు టైటాన్స్ ఇంటికి.. పుణెరి ఫైనల్‌‌‌‌కు

న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌‌‌‌లో టైటిల్ కలను తెలుగు టైటాన్స్ జట్టు నెరవేర్చుకోలేకపోయింది. బుధవారం  జరిగిన క్వాలిఫయర్‌‌‌‌–2 మ్యాచ్‌‌‌‌లో టైటాన్స్ 45–50 తేడాతో పుణెరి పల్టాన్ చేతిలో పోరాడి ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ విజయంతో పల్టాన్ ఫైనల్‌‌‌‌కు దూసుకెళ్లింది. టైటాన్స్ తరఫున భరత్ హుడా (23 పాయింట్లు), 

కెప్టెన్ విజయ్ మాలిక్ (11 పాయింట్లు) అద్భుతంగా పోరాడి సూపర్ టెన్ సాధించినా ఫలితం లేకపోయింది. ఆట ఆరంభంలోనే టైటాన్స్ 10–1 ఆధిక్యంతో దూసుకుపోయినప్పటికీ, ఆ తర్వాత పుణెరి పల్టాన్ అనూహ్యంగా పుంజుకుంది. పుణెరి రైడర్లు ఆదిత్య షిండే (22), పంకజ్ మోహితే (10) మెరుపు రైడింగ్‌‌‌‌తో విజయం సాధించారు. డిఫెండర్ గౌరవ్ ఖత్రి (5) కూడా రాణించాడు. ఈ మ్యాచ్‌‌‌‌లో టైటాన్స్ ఒక్కసారి మాత్రమే ప్రత్యర్థిని ఆలౌట్ చేయగా, పుణెరి ఏకంగా 
నాలుగుసార్లు తెలుగు జట్టును ఆలౌట్ చేసింది. సెకండాఫ్‌‌‌‌లో మూడుసార్లు ఆలౌట్ అవ్వడం టైటాన్స్‌‌‌‌ను దెబ్బతీసింది. శుక్రవారం జరిగే మెగా ఫైనల్లో దబాంగ్ ఢిల్లీ కేసీతో పుణెరి పల్టాన్ అమీతుమీ తేల్చుకోనుంది.