హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లు బలమైన రికవరీని సాధించాయని ప్రభుదాస్ లీలాధర్(పీఎల్) అసెట్ మేనేజ్‌మెంట్ ఏప్రిల్రిపోర్ట్ పేర్కొంది. గత నెల నిఫ్టీ 7.46 శాతం, మిడ్‌క్యాప్ 13.22 శాతం, స్మాల్‌క్యాప్ 17.10 శాతం వృద్ధి చెందాయి.
జీఎస్‌టీ వసూళ్లు రూ.2.42 లక్షల కోట్లకు చేరడం, మాన్యుఫ్యాక్చరింగ్ పీఎంఐ 55.9కి మెరుగుపడటం మార్కెట్లకు సానుకూలంగా మారింది. టోకు ద్రవ్యోల్బణం 3.88 శాతంతో 38 నెలల గరిష్ఠానికి చేరడం, బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 126 డాలర్లకు పెరగడం కొంత ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది.
ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి మందగమనం, ద్రవ్యోల్బణం సవాళ్ల మధ్య భారత ఈక్విటీ మార్కెట్లు నిలదొక్కుకున్నాయని బజాజ్ ఫిన్‌సర్వ్ ఏఎమ్‌సీ రిపోర్ట్ కూడా తెలిపింది.
విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ఏప్రిల్‌లో రూ.70 వేల కోట్లకు తగ్గడం మార్కెట్లకు సానుకూలంగా మారింది. అయితే బాండ్లపై రాబడులు పెరుగుతున్నాయి. ఐటీ రంగంలో ఏఐ తెస్తున్న మార్పుల వల్ల ఆ విభాగానికి దూరమవుతున్నారని బజాన్ ఫిన్‌సర్వ్ పేర్కొంది.
