
ములుగు జిల్లా: పోలీసులను చంపాలని చూసిన ఆరుగురు మిలీషియా సభ్యులను అరెస్టు చేశామని తెలిపారు ఏటూరు నాగారం పోలీసులు. శుక్రవారం వెంకటాపురం (నూగురు) మండల పరిధిలోని, తిప్పాపురం, పెద్ద ఉట్లపల్లి అటవీ ప్రాంతంలో పోలీస్ పార్టీలను చంపడానికి అడవిలో పేలుడు పదార్థాలను అమరుస్తుండగా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. రెండు స్టీల్ టిఫిన్ బాక్సులు, రెండు డిటోనేటర్స్, కోడెక్స్ వైర్ స్వాధీనపరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు.