V6 News

హైవే పై కారును వెనక నుంచి ఢీకొట్టిన ఫ్లైట్.. వీడియో వైరల్

హైవే పై కారును వెనక నుంచి ఢీకొట్టిన ఫ్లైట్.. వీడియో వైరల్

ఎయిర్ పోర్టులో రన్ వే పై దిగాల్సిన విమానం.. హైవేపైన క్రాష్ ల్యాండ్ అయిన వీడియో వైరల్  గా మారింది. రోడ్డుపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయబోయిన విమానం.. కారును వెనక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. కారుపై నుంచి పల్టీలు కొట్టి క్రాష్ అయ్యింది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఫ్లోరిడాలోని ఓర్లాండో ఇంటర్ స్టేట్-95 (1-95) హైవేపై సోమవారం ( ఇండియాలో మంగళవారం, 09) మిని ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. కొకొవాలోని మైల్ మార్కెట్ దగ్గర బీచ్ క్రాఫ్ట్ 55 ఫ్లైట్.. కారును వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు ఫెడరల్ విమాన సంస్థ (FAA) పేర్కొంది. 

ఈ ప్రమాదంలో ఫ్లైట్ లో ఉన్న పైలట్, ప్రయాణికునికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కారు డ్రైవర్ (57) తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు.