మధ్యప్రదేశ్‌లో విమాన ప్రమాదం.. ట్రైనీ పైలట్ మృతి

మధ్యప్రదేశ్‌లో విమాన ప్రమాదం.. ట్రైనీ పైలట్ మృతి

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో ట్రైనీ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ట్రైనీ పైలట్ మృతి చెందగా.. మరొకరు ఆచూకీ లభించలేదు. కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భక్కుటోలా కొండల సమీపంలో ఈ విమానం కూలిపోయింది. మార్చి 18న మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. 

ఈ ఘటనలో ట్రైనీ పైలట్ రుకశంక మరణించారని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ATC గోండియా సంస్థ ధృవీకరించింది. విమానంలో ఉన్న మరో పైలట్ మోహిత్‌ను గుర్తించేందుకు సెర్చింగ్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బాలాఘాట్ సరిహద్దులో మహారాష్ట్రలోని గోండియా జిల్లాలోని బిర్సీ విమానాశ్రయం నుండి ఈ ట్రైనీ విమానం బయలుదేరినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారుల బృందం సంఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు.