రోడ్డుపై ప్రయాణిస్తున్న విమానం.. చూసేందుకు ఎగబడ్డ జనం

రోడ్డుపై ప్రయాణిస్తున్న విమానం.. చూసేందుకు ఎగబడ్డ జనం

ఆకాశంలో ఎగిరే విమానం ఒక్కసారిగా రోడ్డుపై ప్రయాణిస్తే.. ఏంటీ విమానం రోడ్డుపై నడవటం ఏంటంటారా.. అదెలా సాధ్యం.. ఎందుకు విమానం రోడ్డుపైకి వస్తుంది.. అని కన్ఫ్యూస్ అవుతున్నారా.. విమానం నేరుగా రోడ్డుపై ప్రయాణిస్తూ రాలేదండీ.. ఓ భారీ ట్రక్కు విమానాన్ని మోసుకొచ్చింది. ఈ క్రమంలో రోడ్డుపై భారీ విమానం కనిపించడంతో అక్కడి ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. 

అదేంటి విమానం రోడ్డుపై ఉంది.. ఏదైనా ప్రమాదం జరిగి పైనుంచి కిందపడిందా.. లేక ఏమై ఉంటుందా.. అని విమానం దగ్గరికి పరుగులు తీశారు జనాలు. తీరా అక్కడికి వెళ్లి చూసేసరికి ఓ ట్రక్కుపై విమానాన్ని తీసుకెళ్తున్నారు. దీంతో ప్రజలంతా విమానంతో సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. మరికొందరు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి.  

అయితే అనంతపూర్ లోని కస్టమ్స్ ఏవియేషన్ అకాడమీ కాలేజీలో విద్యార్థులకు అవగాహన కోసం శంషాబాద్ విమానాశ్రయం నుంచి అనంతపూర్ కు అధికారులు తరలించారు. ఎయిర్ ఇండియా విమానా విడిభాగాలను రెండు భారీ ట్రక్కుల్లో.. 25 టన్నుల విమాన బాడీని చేరవేశారు. మరో ట్రక్కులో విమానం ఇంజన్ సామాగ్రిని కూడా రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. 

ఈ విమానం శంషాబాద్ జాతీయ రహదారికి చేరుకోగానే ఎయిర్ ఇండియా విమానాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విమానం రోడ్డుపైకి ఎందుకు వచ్చింది.. ఎటు వెళ్తుంది.. ఎందుకు వెళ్తుంది. అని అమోమయానికి గురయ్యారు. మరికొందరైతే భారీ విమానంతో సెల్ఫీలు దిగడానికి జనాలు ఎగబడ్డారు. విమానం పొడవు భారీ స్థాయిలో ఉండడంతో శంషాబాద్ జాతీయ రహదారిపైన ట్రక్కు రోడ్డు క్రాస్ చేయడానికి డ్రైవర్ తీవ్రంగా శ్రమించాడు. 

దాని వెనక ఉన్న వాహనాలన్ని నిలిపోయాయి. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఈ విమాన ప్రయాణికుల కెపాసిటీ 180 మందికి సరిపడా ఉంటుందని అధికారులు తెలిపారు.