
- ప్లానెటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్
బషీర్ బాగ్ ,వెలుగు : అంతరిక్ష విజ్ఞానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘ ఫ్లాగ్ఆన్ మూన్’ చేపట్టనున్నట్లు ప్లానెటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు గా బల్దియా150 డివిజన్లలోని 150 స్కూళ్లను ఎంపిక చేసుకుని.. చంద్రయాన్ మిషన్ పై ట్రైనింగ్ ఇస్తామని పేర్కొన్నారు. చంద్రయాన్–3 లాంచ్ చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నేషనల్ స్పేస్ డే ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
శుక్రవారం అబిడ్స్ లోని లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ లో చంద్రయాన్ మిషన్ పై వర్క్ షాప్ నిర్వహించారు. వివిధ స్కూల్స్ కు చెందిన టీచర్స్, స్టూడెంట్స్ కు చంద్రయాన్ మిషన్ పై వివరించారు. ఫ్లాగ్ ఆన్ మూన్ లో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన స్కూల్స్ ప్లానెటరీ సొసైటీని సంప్రదించాలని ఆయన సూచించారు.