ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: సీఎంకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి లేఖ

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: సీఎంకు  ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి లేఖ

హైదరాబాద్, వెలుగు: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని ప్లానింగ్ కమిషన్  వైస్ చైర్మన్ చిన్నారెడ్డి కోరారు. 

శనివారం ( అక్టోబర్ 11) అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో వేలాది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారని, అయితే వారిని ప్రైవేట్ ఏజెన్సీలు నియమించడం వల్ల శ్రమ దోపిడీకి గురవుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

 ప్రైవేట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. పైగా వాటిని కూడా ప్రతి నెల ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్  ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు.