వాట్సాప్‌‌ను డిలీట్ చేయాలనుకుంటున్నారా? డేటాను డౌన్‌‌లోడ్ చేసుకోండిలా..

వాట్సాప్‌‌ను డిలీట్ చేయాలనుకుంటున్నారా? డేటాను డౌన్‌‌లోడ్ చేసుకోండిలా..

వాట్సాప్ బోర్ కొట్టేసిందా? మీ ఫోన్ నుంచి వాట్సాప్‌‌ను డిలీట్ చేయాలనుకుంటున్నారా? అయితే అందులోని డేటాను ఎలా రీస్టోర్ చేయాలో తెలుసుకోండి. మీరు మీ వాట్సాప్ అకౌంట్‌ను డిలీట్ చేసినప్పుడు అందులోని ఫొటోలు, వీడియోలు, ఛాట్‌‌లతోపాటు మిగిలిన డేటా కూడా పర్మినెంట్‌గా డిలీట్ అవుతుంది. కాబట్టి డేటా మిస్సవ్వకుండా వాట్సాప్‌‌ను డిలీట్ చేయడం ఎలాగో తెలుసుకోండి. ఇలాంటి వాటి కోసమే గత కొన్నేళ్లలో అర్చీవ్ చాట్స్, మ్యూట్ గ్రూప్స్, స్టార్ ఇంపార్టెంట్ మెసేజెస్ లాంటి ఫీచర్లను వాట్సాప్ డెవలప్ చేసింది.

వాట్సాప్ డేటాను డౌన్‌లోడ్ చేసుకోండిలా..
వాట్సాప్ అకౌంట్‌ను డిలీట్ చేసేముందు అందులోని డేటాను డౌన్‌‌లోడ్ చేసుకొని దాన్ని బ్యాకప్ చేసుకోవాలి.
పర్సనల్ వాట్సాప్ చాట్‌‌ను ఎక్స్‌‌పోర్ట్ చేసుకోవచ్చు. అందుకు సెట్టింగ్స్>చాట్స్>చాట్ హిస్టరీ>ఎక్స్‌‌పోర్ట్ చాట్ చేయాలి.
ఎక్స్‌పోర్ట్ చేయాలనుకునే చాట్‌‌‌ను ఎంపిక చేసుకోవాలి.
ఇన్‌క్లూడ్ మీడియాను ఓపెన్ చేసి.. ఫైల్స్, ఫొటోస్, వీడియోస్‌‌ను ఇన్‌‌క్లూడ్ చేసుకోవడచ్చు.
ఏ యాప్‌‌లోకి మీ డేటాను ఎక్స్‌‌పోర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్‌‌ను సెలెక్ట్ చేయాలి. గూగుల్ డ్రైవ్, జీమెయిల్ లాంటి యాప్స్‌‌లో డేటాను ఎక్స్‌‌పోర్ట్ చేసుకోవచ్చు.