సియోల్​లో అదిరిపోయే సిటీ ప్లాన్​

సియోల్​లో అదిరిపోయే సిటీ ప్లాన్​

దక్షిణ కొరియా రాజధాని సియోల్​లో అదిరిపోయే సిటీ ప్లాన్​ ఫొటోలు​ వైరల్​ అవుతున్నాయి. టెన్​ మినిట్ సిటీ పేరుతో విడుదలైన ఈ హైటెక్​ ఆర్కిటెక్చర్​ మోడల్​ ఆశ్చర్యపరుస్తోంది.15 మినిట్ సిటీ కాన్సెప్ట్​కి గత అయిదారేళ్లుగా క్రేజ్​ పెరుగుతోంది. ఈ కాన్సెప్ట్​లో పావుగంటలో నడిచివెళ్లేంత దూరంలో స్కూల్​, మార్కెట్, జిమ్​, హాస్పిటల్, పార్క్​, లైబ్రరీ వంటివి ఉంటాయి.కార్ల వంటి ఫోర్​వీలర్స్​ వెహికల్స్​కు నో ఎంట్రీ. ‘వాక్​ ఆర్​ బైక్​’ అన్నది ఎక్కువగా ఫాలో అవుతారు ఇక్కడ. ఇప్పుడు సియోల్​లో కట్టేది ఇంత కంటే బెటర్​ కాన్సెప్ట్​ 10 మినిట్​ సిటీ... ప్రాజెక్ట్​ హెచ్​ వన్​ పేరుతో పిలుస్తున్న ఈ సిటీలో ఎనిమిది భారీ టవర్స్​ ఉంటాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి కనెక్టయి ఉంటాయి. పది నిమిషాల్లో ఈ సిటీలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. పెద్ద పెద్ద వాకింగ్​ కారి డార్స్​తో సిటీ అంతా ఇంటర్​లింక్ అయి ఉంటుంది. ఇందులో వ్యవసాయం కోసం కూడా కొన్ని బ్లాక్స్​ ఉన్నాయి. ఈ హైటెక్​ ఆర్కిటెక్చర్​ ప్లాన్​ను యూఎన్​ స్టూడియో వాళ్లు డిజైన్​ చేశారు. కొవిడ్​ ఎఫెక్ట్​ తర్వాత ఇలాంటి ప్లానింగ్​కు ఎక్కువమంది కనెక్ట్​ అవుతున్నారట.