చిన్నారి కంటి నుండి ప్లాస్టిక్, ఇనుప ముక్కలు..

చిన్నారి కంటి నుండి ప్లాస్టిక్, ఇనుప ముక్కలు..

మహబూబాబాద్ జిల్లాలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని గార్ల మండలం పెద్ద కృష్టాపురం గ్రామంలో భూక్య సౌజన్య అనే చిన్నారి కంటి నుండి ప్లాస్టిక్, ఇనుప,పేపర్ ముక్కలు, బియ్యం గింజలు బయటపడుతుండడం కలకలం రేపుతోంది. గత వారం పది రోజులు నుండి బాలిక కూడి కన్ను నుండి ఇలా రకరకాల వస్తువులు జారిపడుతున్నాయి. ఈ వింత పరిణమంతో చిన్నారి తల్లిదండ్రులు భయందోళన గురవుతున్నారు. ఈ విషయం ఆనోటా..ఇటోటా పడి ఊరు మొత్తం తెలిసింది. ఈ క్రమంలో కృష్టాపురం వాసులు వింతగా చూస్తున్నారు.

బాలికను ఖమ్మంలో ఓ ప్రైవేటు హస్పటల్ కి తరలించారు తల్లిదండ్రులు. దీంతో డాక్టర్లు పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలను సూచించారు. ఆర్ధిక స్థోమతి లేక పెద్ద హస్పిటల్ కి తీసుకపోలేకపోతున్నమని బాలిక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పాపను ప్రభుత్వమే అదుకోవాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. బాలిక స్థానిక పాఠశాలలో1 వ తరగతి చదువుతోంది.