మహిళల కోసం ప్లాటినమ్ ఎవారా నోవా కలెక్షన్       

మహిళల కోసం ప్లాటినమ్ ఎవారా నోవా కలెక్షన్       

ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ (పీజీఐ)- ఇండియా , సెన్కో గోల్డ్ అండ్​ డైమండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి మహిళల కోసం ప్లాటినం ఎవారా నోవా నగల కలెక్షన్​ను అందుబాటులోకి తెచ్చింది.  వీటిని 95శాతం స్వచ్ఛమైన ప్లాటినంతో రూపొందించామని ప్రకటించింది.

ఈ కలెక్షన్ పై సెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కో గోల్డ్ అండ్​ డైమండ్స్ సీఈఓ అండ్​ ఎండి సువంకర్ సేన్ మాట్లాడుతూ ఈ కలెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని విడుదల చేయడానికి పీజీఐతో కలిసి పని చేస్తున్నామని చెప్పారు.  వీటి ధరలు రూ. 20 వేల నుంచి  రూ. 60 వేల వరకు ఉంటాయి.   నోవా కలెక్షన్ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కో గోల్డ్ అండ్​ డైమండ్స్ స్టోర్లలో అందుబాటులో ఉంది.