జగన్ కు సీబీఐ కోర్టు షాక్

జగన్ కు సీబీఐ కోర్టు షాక్

సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ కు ఎదురు దెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసులో కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలని జగన్ దాఖలు  చేసిన పిటిషన్ ను కోర్టు డిస్మీస్ చేసింది. పిటిషన్ పై కోర్టులో జగన్ తరపున న్యాయవాది, సీీబీఐ వాదనలు వినిపించారు. ఈ సందర్బంగా  జగన్ మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని సిబిఐ వాదించింది.  సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు  వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వలేమని..  కోర్టుకు హాజరు కావాల్సిందేనని తెలిపింది.