ఆదిపురుష్‌ అత్యవసర విచారణ.. రిజెక్ట్ చేసిన ఢిల్లీ హైకోర్ట్

ఆదిపురుష్‌ అత్యవసర విచారణ.. రిజెక్ట్ చేసిన ఢిల్లీ హైకోర్ట్

ఆదిపురుష్(Adipurush) సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ హిందూ సేన(Hindu Sena) వేసిన అత్యవసర పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు(Dilli High Court) తిరస్కరించింది. సినిమాను చాలా వరకు తప్పుగా చూపించారని, సన్నివేశాలు, పాత్రల చిత్రీకరణ విషయంలో కూడా చాలా వరకు విమర్శలు ఎదుర్కొంది ఆదిపురుష్ సినిమా. దీంతో ఈ సినిమాని వెంటనే నిలిపివేయాలని, ఈ విషయాన్ని అత్యవసరంగా విచారించాలని ఢిల్లీ హైకోర్టులో పీల్ దాఖలు చేసింది హిందూ సేన.

అయితే, ఈ విషయాన్ని అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అంతేకాదు  సాధారణ కోర్సులో జాబితా చేయబడిన జూన్ 30వ తేదీన విచారణకు రావాలని మేకర్స్ ను కోరింది. దీంతో చిత్ర యూనిట్ కు కాస్త ఊరట లభించింది.

ఇక ఆదిపురుష్ సినిమాపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అంతే కాదు .. నేపాల్(Nepal) దేశంలో ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది అక్కడి ప్రభుత్వం. ఇక మీదట భారత్ నుండి వచ్చే ఏ సినిమా కూడా నేపాల్ లో ప్రదర్శితం కావంటూ ఈ ప్రకటనలో తెలిపింది.