సప్త సాగర దాచే ఎల్లో ఎమోషన్స్‌‌‌‌తో కూడిన ప్లెజెంట్ లవ్‌‌‌‌ స్టోరీ

సప్త సాగర దాచే ఎల్లో ఎమోషన్స్‌‌‌‌తో కూడిన ప్లెజెంట్ లవ్‌‌‌‌ స్టోరీ

కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’. అక్కడ సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ శుక్రవారం విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా రక్షిత్ శెట్టి మాట్లాడుతూ ‘దర్శకుడు హేమంత్‌‌‌‌తో నాకిది రెండో సినిమా. మొదటి దాని తర్వాత వెంటనే మరో మూవీ చేయాలనుకున్నాం.  

కానీ తర్వాత నేను అతడే శ్రీమన్నారాయణ, ఛార్లీ సినిమాలతో బిజీ అయ్యాను. మంచి ప్రేమకథ చేయాలనుకున్నప్పుడు హేమంత్ ఈ స్టోరీ చెప్పాడు. ఈ కథని చాలా పొయెటిక్‌‌‌‌గా ఎంతో అందంగా రూపొందించాడు. ఎమోషన్స్‌‌‌‌తో కూడిన ప్లెజెంట్ లవ్‌‌‌‌ స్టోరీ. సినిమాటోగ్రఫీ,  సంగీతంతో పాటు కథలో లీనమయ్యే సౌండ్ డిజైన్‌‌‌‌ ఇందులో హైలైట్‌‌‌‌గా ఉంటుంది.  

షూటింగ్ సమయంలో హీరో హీరోయిన్ పాత్రల మధ్య కెమిస్ట్రీ చూసి హేమంత్ దీన్ని రెండు భాగాలుగా తీద్దాం అన్నాడు. మొదట నాకు కాస్త ఆందోళన కలిగినప్పటికీ.. కథ మీద, ఆయన విజన్ మీద నమ్మకంతో అంగీకరించాను. షూట్ అయ్యాక ఎడిటింగ్ టేబుల్ పై చూసుకున్నాక.. రెండు భాగాలుగా చెప్పాలనే ఆయన ఆలోచన సరైనది అనిపించింది. 

దీన్ని పార్ట్‌‌‌‌1, పార్ట్‌‌‌‌2 అని కాకుండా గతంలో క్యాసెట్లపై ఉన్నట్టుగా సైడ్ ఏ, సైడ్ బి అని పెట్టాలనుకున్నాం.  ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా. స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయడానికి నేనెప్పుడూ రెడీ’ అని అన్నాడు.