టీకా సరఫరాపై దేశాలు ఓపికగా ఉండాలె

టీకా సరఫరాపై దేశాలు ఓపికగా ఉండాలె

న్యూఢిల్లీ: వ్యాక్సిన్‌‌ను అన్ని దేశాలకు సరఫరా చేయడానికి మరికొంత సమయం పడుతుందని సీరం ఇన్‌‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావల్లా అన్నారు. కొవిషీల్డ్ సరఫరాపై ఓపికగా ఉండాలని దేశాలు, ప్రభుత్వాలను కోరారు. భారత్‌‌తోపాటు మిగిలిన దేశాల అవసరాల కోసం టీకాను తయారు చేసేందుకు తాము తీవ్రంగా శ్రమిస్తున్నామని ట్వీట్ చేశారు. వచ్చే రెండు నుంచి మూడు వారాల్లో 30 దేశాలకు కొవిషీల్డ్‌ను అందిస్తామని పేర్కొన్నారు. దేశంలో డీసీజీఐ ఆమోదం తెలిపిన రెండు కరోనా వ్యాక్సిన్‌‌లలో సీరం రూపొందించిన కొవిషీల్డ్‌‌తోపాటు భారత్ బయోటెక్ తయారు చేసిన కొవ్యాక్సిన్ ఉన్నాయి. హెల్త్ వర్కర్లతోపాటు వయస్సును బట్టి దశల వారీగా కేంద్రం వ్యాక్సినేషన్ చేస్తోంది.