దయచేసి నన్ను, నరేష్ ను సపోర్ట్ చేయండి

దయచేసి నన్ను, నరేష్ ను సపోర్ట్ చేయండి

నటుడు నరేష్ భార్య రమ్య రఘుపతి చేసిన ఆరోపణలపై నటి పవిత్ర లోకేశ్ స్పందించారు. ఆమె కావాలనే తనను చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని.. ఆయన గురించి అందరికీ తెలుసని అన్నారు. నరేష్ ఫ్యామిలీ గురించి కూడా అందరికీ తెలుసన్న పవిత్ర.. తాను వాళ్ల మధ్యకు వచ్చి.. రిలేషన్ షిప్ లో ఉన్నానని, పెళ్లి చేసుకున్నానని తనను రమ్య దోషిగా నిలబెట్టిందని చెప్పారు. అది తనను చాలా బాధపెట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై నరేష్ కూడా స్పందించారని, ఇప్పుడు తాను కూడా మాట్లాడడానికి ముందుకు వచ్చానన్నారు. నరేష్ .. తెలుగులో ఫేమస్ యాక్టర్. కానీ ఆమె కర్ణాటక వచ్చి మీడియాతో మాట్లాడడం ఎందుకని ప్రశ్నించారు.  

ఆమెకు తన భర్త కావాలంటే హైదరాబాద్ లో వెళ్లి అడిగితే న్యాయంజరుగుతుంది కానీ... బెంగుళూరులో ఇలా మీడియా ముందు తనను బ్యాడ్ చేయడం తనకు ఏ మాత్రం నచ్చడం లేదని పవిత్ర తెలిపారు. ఏదైనా ఉంటే ఫ్యామిలీలోనే సెట్ చేసుకోవాలన్న ఆమె... హైదరాబాద్ లో చెప్తే పెద్దవాళ్లు వచ్చి న్యాయం చెప్తారని తెలిపారు. కానీ ఇక్కడికి వచ్చి ఇలా ఆరోపణలు చేయడం తప్పు అని చెప్పుకొచ్చారు. కన్నడ నుంచే వచ్చినప్పటికీ... తెలుగు ఇండస్ట్రీలో తాను చాలా ఏళ్ల నుంచి యాక్ట్ చేస్తున్నానని పవిత్ర అన్నారు. దయచేసి ఈ విషయంలో తనకు, నరేష్ కు సపోర్ట్ చేయాలని పవిత్ర లోకేశ్ కోరారు.

ఇదిలా ఉండగా ఈ విషయంపై ఇప్పటికే నరేష్ స్పందించారు. తన భార్య రమ్య కావాలనే ఇలా రూమర్స్ క్రియేట్ చేసిందని.. ఈ అంశంపై కన్నడ మీడియాకు వివరణ ఇచ్చారు. పవిత్రను తాను పెళ్లి చేసుకోలేదని.. ఆమె తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని.. రమ్య చెబుతున్న మాటల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.