న్యూఢిల్లీ: వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్య పతకాలతో చరిత్ర సృష్టించిన తెలంగాణ కుర్రాడు, ఇండియా గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దోహా వేదికగా జరిగిన మెగా ఈవెంట్ ర్యాపిడ్, బ్లిట్జ్ పతకాలు తెచ్చిన అర్జున్ చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన ఇండియన్‌గా నిలిచాడు.
దీనిపై ఎక్స్ పోస్టులో స్పందించిన పీఎం మోదీ ‘వరల్డ్ చెస్‌లో ఇండియా విజయయాత్ర కొనసాగుతోంది. ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచిన అర్జున్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లోనూ కాంస్యం సాధించడం అభినందనీయం. అర్జున్ నైపుణ్యం, పట్టుదల యువతకు స్ఫూర్తినిస్తాయి. తను మరిన్ని విజయాలు సాధించాలి’ అని పేర్కొన్నారు.
