
రైతులకు శుభవార్త..కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ స్కీం డబ్బులు త్వరలో రైతుల ఖాతాల్లో పడనున్నాయి. 18వ విడత పీఎం కిసాన్ డబ్బులు అక్టోబర్ 5 నుంచి రైతుల ఖాతాల్లో వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
జూలై 18, 2024న 17 వ విడత పీఎం కిసాన్ నిధులు 21వేల కోట్లు ప్రధాని మోదీ రైతుల ఖాతాల్లో జమ చేశారు. 9.26 కోట్ల మంది రైతులు లబ్ది పొందారు. 16వ విడత పీఎం కిసాన్ నిధులు 2024 ఫిబ్రవరిలో విడుదల చేశారు.
పీఎం కిసాన్ స్కీం కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2వేల చొప్పున మొత్తం మూడు దఫాలుగా ప్రతియేటా 6వేల రూపాయలు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.ప్రతి సంవత్సరం ఏప్రిల్-జూలై, ఆగస్టు -నవంబర్, డిసెంబర్ -మార్చి మూడు వాయిదాల్లో డబ్బు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు.
పీఎం కిసాన్ పథకాన్ని 2019లో ప్రధాని మోదీ ప్రారంభించారు. అప్పటినుంచి క్రమం తప్పుకుండా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. ఈ స్కీం ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ పర్ స్కీంగా మారింది.
పీఎం కిసాన్ స్కీం లబ్ధి పొందాలంటే అధికారిక వెబ్ సైట్ pmkisan.gov.in లోకి వెళ్లి ఈ కేవైసీ ని పూర్తిచేయాలి. పోర్టల్ ద్వారా OTP ఆధారిత eKYC చేసుకోవచ్చు. CSC కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్ ఆధారిత e KYC చేసుకోవచ్చు.
లబ్ధిదారుల స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
- అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ని సందర్శించాలి
- ఇప్పుడు పేజీకి కుడి వైపున ఉన్న Know your Status ట్యాబ్‌పై క్లిక్ చేయాలి
- మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి తర్వాత Get Data ఆప్షన్ ను ఎంచుకోవాలి
- స్క్రీన్ మీద లబ్ధిదారుడి స్టేటస్ కనిపిస్తుంది.
- PM-కిసాన్ లబ్ధిదారుల లిస్టులోకి ఉందా ..?
- PM-కిసాన్ లబ్ధిదారుల లిస్టులోకి వెళ్లి మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాలి
- PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ www.pmkisan.gov.in ని సందర్శించండి
- Beneficiary list ట్యాబ్‌పై క్లిక్ చేయాలి
- డ్రాప్-డౌన్ నుండి ఎంపిక చేయబడిన రాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా, బ్లాక్ , గ్రామం వంటి వివరాలను సెలెక్ట్ చేసుకోవాలి
- Get Report ట్యాబ్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ స్టేటస్ ను తెలుసుకోవచ్చు.
PM కిసాన్ సమ్మాన్ నిధికి ఇలా దరఖాస్తు చేసుకోండి..
- pmkisan.gov.inని సందర్శించాలి
- New Farmer Registration పై క్లిక్ చేసి ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చాను ఎంటర్ చేయాలి
- అవసరమైన వివరాలను నమోదు చేసి Yes పై క్లిక్ చేయాలి.
- PM-కిసాన్ దరఖాస్తు ఫాం 2024లో అడిగిన సమాచారాన్ని పూరించండి. దానిని Save చేయండి , భవిష్యత్తు సూచన కోసం ప్రింటవుట్ తీసుకోవాలి.