
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ యోజన 15వ విడత నవంబర్ 15, 2023న అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా బదిలీ చేయబడుతుంది. ఈ పంపిణీ దేశ వ్యాప్తంగా దాదాపు 8కోట్ల రైతులకు పైగా అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 15, 2023న దేశంలోని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు DBT ద్వారా బదిలీ చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ ఎక్స్ లో తన పోస్ట్‌లో రాశారు.
PM-KISAN పథకం కింద, భూమి కలిగి ఉన్న రైతుల కుటుంబాలందరికీ సంవత్సరానికి రూ.6వేల ఆర్థిక ప్రయోజనం అందించబడుతుంది. రూ. 2వేల చొప్పున 3 సమాన వాయిదాలలో ఇది చెల్లించబడుతుంది. అర్హులైన 8.5 కోట్ల మంది రైతులకు రూ. 17వేల కోట్ల విలువైన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM-KISAN) 14వ విడతను జూలై 27న ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. రాజస్థాన్‌లోని సికార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు.
లబ్ధిదారుని స్థితిని ఎలా తనిఖీ చేయాలంటే..
PM కిసాన్ లబ్ధిదారుడి స్టేటస్
1) అధికారిక వెబ్‌సైట్ — pmkisan.gov.inని సందర్శించండి
2) ఇప్పుడు, పేజీకి కుడి వైపున ఉన్న 'నో యువర్ స్టేటస్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి
3) మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చా కోడ్‌ని పూరించండి. 'డేటా పొందండి' అనే ఆప్షన్ ను ఎంచుకోండి
3) ఇప్పుడు Beneficiary Status అనే పేజీ స్ర్కీన్ పై కనిపిస్తుంది
PM-కిసాన్: లబ్ధిదారుల జాబితాలో మీ పేరును చెక్ చేయండిలా..
- PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ www.pmkisan.gov.inని సందర్శించండి
- 'Beneficiary list' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- డ్రాప్-డౌన్ నుండి చూజ్ చేసుకున్న రాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలను ఎంచుకోండి
- 'గెట్ రిపోర్ట్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి
'పీఎం-కిసాన్ యోజన'లో ఎలా చేరాలంటే..
- pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి, farmer’s cornerకి వెళ్లండి
- New Farmer Registrationపై క్లిక్ చేసి, ఆధార్ నంబర్‌ను నమోదు చేసి క్యాప్చా నింపండి
- వివరాలను నమోదు చేసి, ‘Yes’పై క్లిక్ చేయండి
- PM కిసాన్ దరఖాస్తు ఫారమ్ 2023లో అడిగిన సమాచారాన్ని పూరించండి. ఆ తర్వాత దాన్ని సేవ్ చేయండి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి
पीएम किसान सम्मान निधि की 15वीं क़िस्त, 15 नवंबर 2023 को प्रधानमंत्री श्री @narendramodi जी द्वारा देश के पात्र किसानों के बैंक खातों में DBT के माध्यम से की जाएगी हस्तांतरित...#PMKisan15thInstallment https://t.co/yTOKLI6KyV
— Narendra Singh Tomar (@nstomar) November 11, 2023