- ప్రధాని మోదీ ట్వీట్
న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం మహిళలు పూర్తి సామర్థ్యాన్ని చాటుకునే అనుకూల వాతావరణాన్ని సృష్టించిందని ప్రధాని మోదీ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆయన వివిధ రంగాల్లో మహిళలకు అవకాశాలను విస్తరించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను గుర్తుచేశారు.
ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, వ్యవస్థాపకత నుంచి మొదలుకుని విద్య, వైద్యం, పారిశుధ్యం, గృహ నిర్మాణం, క్రీడలు, సైన్స్, పాలన వరకు ప్రతి రంగంలోనూ నేడు మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారని మోదీ ప్రశంసించారు. “ఎన్డీయే ప్రభుత్వ కృషి గౌరవం, అవకాశాలు, సాధికారత అనే పునాదులపై ఆధారపడి ఉంది. ఇవి మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని చాటుకుని, దేశ నిర్మాణంలో మరింత బలంగా తోడ్పడే వాతావరణాన్ని కల్పించాయి” అని పేర్కొన్నారు.
