భారత్ సరికొత్త దిశగా అడుగులు వేస్తోందన్నారు ప్రధాని మోడీ. మనోరమ న్యూస్ కాంక్లేవ్ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ… న్యూ ఇండియా అంటే ఏ కొందరి వాయిస్ కాదన్నారు. 130 కోట్ల భారతీయుల వాయిస్ అన్నారు. అభివృద్ధిలో దేశం దూసుకెళ్తోందన్నారు. జన్ ధన్ అకౌంట్లలో లక్ష కోట్ల రూపాయలు డిపాజిట్ చేసుకున్నారని , చాలా మంది గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారని అన్నారు. మార్పు చెందుతున్న భారత్ లో ప్రజలు కేవలం ప్రేక్షకుల్లా ఉండిపోవాలనుకోవడం లేదని, తాము కూడా భాగస్వాములు అవ్వాలనుకుంటున్నారని మోడీ ప్రశంసించారు .
Addressing the Manorama News Conclave. Watch. https://t.co/djcjr63kUb
— Narendra Modi (@narendramodi) August 30, 2019

