పాశమైలారం ఘటనపై మోదీ సంతాపం.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా

పాశమైలారం  ఘటనపై మోదీ సంతాపం.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా
  • మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ఇస్తామన్న మోదీ
  • ప్రమాదంపై ఎక్స్​ వేదికగా సంతాపం

న్యూఢిల్లీ, వెలుగు: పాశమైలారం ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలుగు, ఇంగ్లిష్ లో ఆయన స్పందించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డిలోని ఒక ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’  అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ (పీఎంఎన్‌‌ఆర్‌‌ఎఫ్‌‌) నుంచి తక్షణ సాయంగా రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్‌‌గ్రేషియా అందిస్తామని ఆయన ప్రకటించారు.