ప్రధాని మళ్లీ దొరికిపోయారు: రాహుల్ గాంధీ

ప్రధాని మళ్లీ దొరికిపోయారు: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: తిమ్మిని బమ్మిచేయాలని కాగ్ ఎంత ప్రయత్నించినా, రక్షణ శాఖ అధికారుల డిసెంట్ నోట్స్​ని చేర్చకుం డా రూపొందించిన తప్పుడు రిపోర్టులోనూ మోడీ మళ్లీ దొరికిపోయారని కాం గ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 129 విమానాల్ని కొనుగోలు చేయాలన్న పాత ఒప్పందాన్ని మార్చేసి , 39 విమానాల్ని మాత్రమే దిగుమతి చేసుకునేలా కొత్త డీల్ కుదుర్చు కున్న సందర్భంలో ప్రభుత్వం చెప్పి న రెండు ప్రధాన కారణాలకు, కాగ్ రిపోర్టులో పేర్కొ న్న అంశాలకు అసలు
పొంతనేలేదని రాహుల్ చెప్పారు. ‘కొత్త డీల్ కు సంబంధించి ప్రధాని మోడీగానీ, రక్షణ, ఆర్థిక శాఖల మంత్రులుగానీ రెం డు కారణాలు చెప్పారు.
ఒకటి విమానాల ధరలైతే, రెం డోది ఎయిర్ ఫోర్స్​కు ఉన్న తక్షణ అవసరం. పాత డీల్‌‌తో పోలిస్తే కొత్త డీల్‌‌లో తొలి 18 యుద్ధ విమానాలు 5 నెలల ముందే ఇండియాకు చేరతాయని కాగ్ రిపోర్టు లో చెప్పారు. కానీ అది ముమ్మా టికీ జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే దసో ఏవియేషన్ ఇప్పటికే వివిధ దేశాలకు 83 విమానాల్ని బాకీ పడిం ది. అది ఏడాదికి గరిష్టం గా 8 ఫైటర్ జెట్స్​ను మాత్రమే తయారు చేస్తుం ది. ఆ లెక్కన చివరి రాఫెల్ విమానం ఇండియాకు చేరడానికి ఇంకా 10 ఏండ్లు పడుం ది. అంటే, ఎయిర్ పోర్స్ తక్షణ అవసరం తీర్చుతామని వాళ్లు చెప్పిన మాట పచ్చి అబద్ధం. ఇక ధరల విషయంలోనూ ఇలాం టి మోసమే జరిగింది. (129 విమానాల) పాత డీల్ తో పోల్చుకుం టే కొత్త(36విమానాల) డీల్ లో 17.08 శాతం సొమ్ము ఆదా అయిందని కాగ్ చెప్పింది. కానీ నిజమేం టంటే ధరలు 55.6 శాతం పెరిగాయి. పాత డీల్ ప్రకారం ఒక్కో విమానానికి అయ్యే ఖర్చు 11 మిలియన్ డాలర్లు.కొత్త డీల్ ప్రకారం ఒక్కో రాఫెల్ కి 36 మిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నా రు. అంటే ఒక్కో విమానానికి
అదనంగా 25 మిలియన్ డాలర్లు చెల్లిస్తున్నారన్నమాట. సరిగ్గా ఇక్కడే అవినీతి జరిగిందన్నారు.