న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త బిల్లులపై రగడ నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ బిల్లుల్లో రెండింటిని ఆదివారం రాజ్య సభలో ప్రవేశ పెట్టారు. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకురావడం లాంటి ఘటనల మధ్య కూడా బిల్లులును ఆమోదించారు. ఈ నేపథ్యంలో బిల్లులు ఆమోదం పొందడదంపై ప్రధాని మోడీ స్పందించారు. రైతులకు శుభాభినందనలు తెలిపారు. దేశ వ్యవసాయ రంగంలో టెక్నలాజికల్, నిర్మాణ పరమైన మార్పులు రావాల్సి ఉందని, ఈ బిల్లుల ద్వారా ఆ దిశగా అడుగులు పడ్డాయన్నారు.
I said it earlier and I say it once again:
System of MSP will remain.
Government procurement will continue.
We are here to serve our farmers. We will do everything possible to support them and ensure a better life for their coming generations.
— Narendra Modi (@narendramodi) September 20, 2020
‘ఇంతకు ముందే చెప్పా, ఇప్పుడు మరోమారు చెబుతున్నా. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) విధానం కొనసాగుతుంది. ప్రభుత్వ సేకరణ కూడా కంటిన్యూ అవుతుంది. మేం రైతులకు సేవ చేయడానికే ఉన్నాం. వారికి మద్దతుగా నిలిచే ప్రతి పనిని మేం చేస్తాం. వారి భావి తరాల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తాం. ఇది భారత్ వ్యవసాయ రంగ చరిత్రలో వాటర్ షెడ్ ఉద్యమం లాంటిది. ఈ బిల్లుల ఆమోదం సందర్భంగా శ్రమ జీవులైన మన రైతులకు శుభాభినందనలు. వ్యవసాయ రంగంలో నవీన మార్పులు వస్తాయి. దశాబ్దాలుగా కొన్ని అవరోధాల వల్ల మధ్యవర్తులు, దళారీల ఒత్తిళ్లు, బెదిరింపుల వల్ల రైతులు బాధలు పడ్డారు. అలాంటి బాధల నుంచి రైతులను బయట పడేయడానికే పార్లమెంట్‌లో ఈ బిల్లులను ప్రవేశపెట్టాం. వీటితో రైతుల ఆదాయం రెట్టింపవడంతోపాటు వారికి చాలా మేలు జరుగుతుంది’ అని మోడీ చెప్పారు.
For decades, the Indian farmer was bound by various constraints and bullied by middlemen. The bills passed by Parliament liberate the farmers from such adversities. These bills will add impetus to the efforts to double income of farmers and ensure greater prosperity for them.
— Narendra Modi (@narendramodi) September 20, 2020

