ఆపరేషన్ సిందూర్ ఆగదు.. పాకిస్తాన్ తో చర్చలు ఈ రెండింటిపైనే : ప్రధాని మోదీ

ఆపరేషన్ సిందూర్ ఆగదు.. పాకిస్తాన్ తో చర్చలు ఈ రెండింటిపైనే : ప్రధాని మోదీ

ఆపరేషన్ సిందూర్ ఆగదని.. జస్ట్ బ్రేక్ మాత్రమే అన్నారు ప్రధాని మోదీ. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత తొలి సారి జాతినుద్దేశించిన మాట్లాడిన ప్రధాని మోదీ.. పాకిస్తాన్ టెర్రరిజం విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదని.. వెనకడుగు వేసేది లేదని కూడా స్పష్టం చేశారు మోదీ. 

పాకిస్తాన్ దేశంతో చర్చల విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు మోదీ. రక్తం, నీళ్లు కలిసి ప్రవహించవు అంటూ సిందు జలాల ఒప్పందం రద్దుపై స్పష్టం ఇచ్చారు. 
ఉగ్రవాదాన్ని ప్రోత్సాహిస్తూ.. వ్యాపార, వాణిజ్య లావాదేవీలు చేస్తాం అంటే సాధ్యం కాదన్నారు.
టెర్రరిజాన్ని పుట్టిస్తూ.. శాంతి చర్చలకు వస్తాం అంటే కుదరదని తెగేసి చెప్పారు మోదీ.
ఉగ్రవాదులను తయారు చేస్తూ.. ఇండియా దాడులు చేస్తూ ఎలాంటి చర్యలకు అయినా సిద్ధమే అంటూ వార్నింగ్ ఇచ్చారు. 
పాకిస్తాన్ తో చర్చల విషయంలో రెండే రెండు అంశాలపై జరుగుతున్నాయని.. ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్, రెండు ఉగ్రవాదులను సమూలంగా నాశనం చేయటం.. ఈ రెండు అంశాలపైనే పాకిస్తాన్ తో చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు మోదీ.
మిగతా అన్ని అంశాలను పక్కన పెట్టేశాం అని స్పష్టం చేశారు మోదీ..