
ఏపీ, తెలంగాణను కలుపుతూ మరో వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించామని ప్రధాని మోడీ అన్నారు. భాగ్యలక్ష్మి నగరాన్ని వెంకటేశ్వర స్వామి నగరంతో కలిపామని అన్నారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన సభలో మోడీ పాల్గొన్నారు. సోదరి సోదరిమణులకు అంటూ తెలుగులో స్పీచ్ ను స్టార్ట్ చేశారు మోడీ. తెలంగాణ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. గడిచిన 9 ఏళ్లలో 70 కీమీ మెట్రో నెట్ వర్క్ నిర్మించామని తెలిపారు. తెలంగాణను అభివృద్ది చేసే అదృష్టం తనకు దక్కిందన్నారు. జాతీయ రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మోడీ హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరంగల్ లో టెక్స్ టైల్ పార్క్ ను స్టార్ట్ చేస్తున్నామని మోడీ తెలిపారు.
అభివృద్ది పనులకు మోడీ శంకుస్థాన
అంతకుముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందేభారత్ రైలును ఫ్రారంభించిన మోడీ.. తెలంగాణలో 6 జాతీయ రహదారుల నిర్మాణం, బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణం సహా రూ.11,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అలాగే సికింద్రబాద్ మహబూబ్ నగర్ విద్యుదీకరణతో పూర్తెన డబ్లింగ్ లైన్ ను మోడీ జాతికి అంకితం చేశారు.