బ్యాంకులే పేదల ఇంటికి వెళ్లాలి : మోడీ

బ్యాంకులే పేదల ఇంటికి వెళ్లాలి : మోడీ

డిజిటలైజేషన్ ద్వారా సామాజిక భద్రతకు భరోసా కల్పించడంలో దేశం అగ్రగామిగా నిలిచిందని  ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశ వ్యాప్తంగా 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించి జాతికి అంకింతం చేశారు. దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ మౌలిక సదుపాయలను IMF ప్రశంసించిందన్నారు మోడీ. ధైర్యసాహసాలతో కొత్త సాంకేతికతను స్వీకరించి తమ జీవితంలో భాగంగా చేసుకున్న పేదలు, రైతులు,కార్మికులకు ఈ క్రెడిట్ దక్కుతుందన్నారు.

ఆర్థిక భాగస్వామ్యం డిజిటల్ భాగస్వామ్యానికి కనెక్ట్ అయినప్పుడు..అవకాశాలతో కూడిన కొత్త ప్రపంచం ప్రారంభమవుతుందని ప్రధాని మోడీ అన్నారు. బ్యాంకులే పేదల ఇంటికి వెళ్లాలని నిర్ణయించామన్నారు మోడీ. దీని కోసం పేదలు-బ్యాంకుల మధ్య దూరాన్ని తగ్గిస్తామన్నారు. మారుమూల ప్రాంతాలకు బ్యాంకులను తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యామన్నారు మోడీ.