మోడీ, ట్రంప్‌ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు

మోడీ, ట్రంప్‌ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు
  • క్లారిటీ ఇచ్చిన అధికారులు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య ఇటీవల ఎలాంటి చర్చలు జరగలేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. భారత్‌, చైనా మధ్య సరిహద్లులో తలెత్తిన ప్రతిష్టంభన తొలగించేందుక మధ్యవర్తిత్వం చేసేందుకు మోడీకి ఫోన్‌ చేశానని, ఆయన మూడ్‌ బాగోలేదని ట్రంప్‌ చెప్పిన నేపథ్యంలో అధికారులు దీనిపై స్పందించారు. మోడీ, ట్రంప్‌ చివరి సారి ఏప్రిల్‌ 4న మాట్లాడుకున్నారని, హైడ్రాక్సీక్లోర్వోకిన్‌ గురించి చర్చించుకున్నారని చెప్పారు. చైనా బలగాలు భారత భూభాగంలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో రెండు దేశాల మధ్య తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్‌ బుధవారం ట్వీట్‌ చేశారు. అదే అంశంపై గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా చెప్పారు. కాగా.. చైనాతో తలెత్తిన ఈ సమస్యను తాము చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని ఇప్పటికే భారత్‌ ప్రకటించింది. తాము కూడా చర్చల ద్వారానే పరిష్కారం తీసుకొస్తామని చైనా విదేశాంగశాఖ కూడా చెప్పింది. ట్రంప్‌ గతంలో కూడా మధ్యవర్తిత్వం వహించి కాశ్మీర్‌‌ సమస్యను పరిష్కరిస్తామని చెప్పగా.. మన దేశం దానికి ఒప్పుకోలేదు.

ఇది కూడా చదవండి

చైనా ఇష్యూపై మోడీకి ఫోన్ చేశా.. ఆయ‌న మూడ్ బాగోలేదు: ట‌్రంప్