టాప్ సీఈవోలుగా ఇండియన్సే ఉండడం గర్వంగా ఉంది

టాప్ సీఈవోలుగా ఇండియన్సే ఉండడం గర్వంగా ఉంది

ప్రపంచంలో అన్ని టాప్ కంపెనీలకు సీఈవోలుగా భారతీయ యువకులే ఉండటం గర్విస్తున్నామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. స్టార్టప్ ల ప్రపంచంలో యువకులు బాగా రాణిస్తున్నారని కొనియాడారు. మన మేధస్సును ఆవిష్కరిస్తూ..దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం గర్వంగా ఉందన్నారు మోడీ. రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు గ్రహితలతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 2021-22 సంవత్సరానికి సంబంధించిన బాల్ పురస్కార్ గ్రహీతలకు ఈ సందర్భంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ సర్టిఫికేట్లు అందజేశారు. మొత్తం ఆరు విభాగాల్లో అసాధారణ విజయాలు సాధించిన పిల్లలకు ప్రభుత్వం ప్రతి ఏటా అవార్డులు ఇస్తోంది. ఈ ఏడాది మొత్తం 29 మంది పిల్లలకు బాల శక్తి పురస్కారానికి  ఎంపికయ్యారు. ప్రతి అవార్డు గ్రహితకు పథకం, నగదు బహుమతి లక్షరూపాయలు అందించనున్నారు. అవార్డులు అందుకున్న వారిలో హైదరాబాద్‌కు చెందిన బాలుడు విరాట్ చంద్ర, ఏపీకి చెందిన బాలిక హిమ ప్రియ ఉన్నారు.

మరిన్ని వార్తల కోసం..

టెర్రరిస్టుకు ఎదురు నిలిచిన వీర బాలిక హిమ ప్రియ

హైదరాబాదీ పిల్లాడికి ప్రధాన మంత్రి బాల పురస్కారం

తల్లి ఫోన్‌లో గేమ్ ఆడుతూ లక్షన్నరకు ఫర్నీచర్ ఆర్డర్