రీసెర్చ్, ఇన్నొవేషన్‌పై మోడీకి క్లియర్ విజన్‌

రీసెర్చ్, ఇన్నొవేషన్‌పై మోడీకి క్లియర్ విజన్‌

బడ్జెట్ సెషన్స్-2022 కు ముందు ప్రైవేట్ రంగం నుంచి ప్రధాని మోడీ ఇన్ పుట్స్ స్వీకరిస్తున్నారు. ఇవాళ పలు ప్రముఖ కంపెనీల సీఎండీలు, సీఈవోలతో ఆయన భేటీ అయ్యారు. కరోనా సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలో పెట్టాలనేదానిపై ప్రధాని మోడీ చర్చించారు. ఈ సమావేశానికి బ్యాంకింగ్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఆటోమొబైల్స్, టెలికాం, కన్స్యూమర్ గూడ్స్, టెక్ టైల్, రెన్యూవబుల్స్, హాస్పిటాలిటీ, టెక్నాలజీ,హెల్త్ కేర్, స్పేస్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన కంపెనీల సీఈవోలు హాజరయ్యారు.

రీసెర్చ్, ఇన్నొవేషన్‌పై మోడీకి క్లియర్ విజన్‌..

ఈ సమావేశం అనంతరం పలు కంపెనీల ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. భారత్‌ను రీసెర్చ్, ఇన్నొవేషన్‌ రంగాల్లో ముందుకు తీసుకెళ్లడంపై ప్రధాని మోడీ ఫోకస్ పెట్టారని టీసీఎస్‌ సీఈవో రాజేశ్ గోపీనాథన్‌ అన్నారు. ఈ విషయంలో ఆయనకు క్లియర్ విజన్‌ ఉందని, ప్రతి సెక్టార్, ఇండస్ట్రీ గ్లోబల్ ర్యాకింగ్స్‌లో భారత్ తొలి ఐదు స్థానాల్లో ఉండాలని సూచించారన్నారు. 

మోడీ పాలసీలపై ఫారెన్‌ ఇన్వెస్టర్లకు పూర్తి భరోసా

భారత్‌ను తయారీ రంగంలో హబ్‌గా మార్చాలన్న ప్రధాని మోడీ లక్ష్యానికి అనుణంగా పని చేసేందుకు కంపెనీలు నిబద్ధతతో ఉన్నాయని మారుతీ సుజకీ ఇండియా లిమిటెడ్ ఎండీ, సీఈవో కెనిచి అయుకవా తెలిపారు. మోడీ పాలసీలపై విదేశీ ఇన్వెస్టర్లకు పూర్తి భరోసా ఉందని, ఈ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫారెన్ కంపెనీలు ధైర్యంగా ముందుకొస్తాయని తాను భావిస్తున్నానని అన్నారు. 

అన్ని రంగాల్లో టాప్‌ – 5లో ఇండియా కంపెనీలే ఉండాలన్నది మోడీ కల

ప్రధాని మోడీతో జరిగిన ఇంటరాక్షన్‌ చాలా ఆసక్తికరంగా, సానుకూలంగా, చాలా ఎంకరేజింగ్‌గా సాగిందని రెన్యూ పవర్ సీఎండీ సుమంత్ సిన్హా అన్నారు. రెండు గంటల పాటు సమావేశం జరిగిందని, తమ సమస్యలు, అభిప్రాయాలను చాలా ఓపికతో విన్నారని చెప్పారు. భారత్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ఆయన ఎక్స్‌పెక్టేషన్స్‌ను మోడీ వివరించారని తెలిపారు. అన్ని రంగాల్లోనూ గ్లోబల్ టాప్‌ – 5 ర్యాంకింగ్స్‌లో ఇండియా కంపెనీలే ఉండాలన్నది ప్రధాని మోడీ కల అని Avaada గ్రూప్‌ చైర్మన్ వినీత్‌ మిట్టల్ చెప్పారు. ఇందుకోసం అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మోడీ స్పష్టం చేశారన్నారు.