ప్రధాని మోదీ ఒరిజినల్ ​బీసీ కాదు : చనగాని దయాకర్

ప్రధాని మోదీ ఒరిజినల్ ​బీసీ కాదు : చనగాని దయాకర్
  • పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ 

సికింద్రాబాద్, వెలుగు : ప్రధాని నరేంద్ర మోదీ ఒరిజినల్ బీసీ కాదని, స్వార్థ రాజకీయాల కోసమే బీసీ కార్డు వాడుతున్నారని పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ విమర్శించారు. శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఏకమై కాంగ్రెస్​ను గెలిపించాలని కోరారు.

రోహిత్ వేముల ఆత్మహత్యకు బీజేపీ నాయకులే కారణమని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాన్ డబ్బాల ఓపెనింగ్ లు తప్ప.. రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక సీఎం రేవంత్​ఓయూను సందర్శిస్తారని తెలిపారు. స్టూడెంట్​నాయకులు శ్రీను, చంద్రశేఖర్, వినయ్, సాయి, ఓంకార్ గౌడ్, పాండు, సతీశ్​యాదవ్, చందుగౌడ్ , శ్రవణ్ యాదవ్ పాల్గొన్నారు.