పెట్రోలియం సరఫరా కోసం.. నేపాల్​కు పైప్​లైన్​

పెట్రోలియం సరఫరా కోసం.. నేపాల్​కు పైప్​లైన్​
  • కలిసి ప్రారంభించిన ప్రధాని మోడీ, నేపాల్​ పీఎం కేపీ శర్మ ఓలి
  • 60 కిలోమీటర్ల పొడవు..రూ. 324 కోట్ల ఖర్చు
  • దక్షిణాసియాలోనే మొదటి ప్రాజెక్టుగా రికార్డు

న్యూఢిల్లీ/కాట్మాండు: సౌత్​ ఏషియాలో రెండు దేశాల మధ్య నిర్మించిన మొట్టమొదటి పెట్రోలియం పైప్​లైన్​ను ఇండియా, నేపాల్​ ప్రధానులు కలిసి ప్రారంభించారు. న్యూఢిల్లీలో మోడీ, కాట్మాండులో కేపీశర్మ  ఓలి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మంగళవారం ప్రాజెక్టును స్విచ్​ఆన్​ చేశారు. డీజిల్, పెట్రోల్​ ఇతర పెట్రోలియం ఉత్పత్తుల్ని సరఫరా చేసేందుకు బీహార్​లోని మోతీహరీ నుంచి నేపాల్​లోని అమ్లేఖ్​గంజ్​ వరకు ఈ పైప్​లైన్​ను నిర్మించారు. ఇండియా, నేపాల్​ మధ్య ఫ్రెడ్​షిప్​కి ఇదొక నిదర్శనమని మోడీ అన్నారు. డెడ్​లైన్​ 30 నెలలైనా రెండు దేశాల కృషితో15 నెలల రికార్డు టైమ్​లో పైప్​లైన్ నిర్మాణం పూర్తయిందని చెప్పారు. పైప్​లైన్​ ద్వారా తక్కువ ఖర్చుతో, అందుబాటు ధరలో నేపాల్​కు పెట్రోలియం సరఫరా అవుతుందని, అలా మిగిలిన డబ్బును సంక్షేమ కార్యక్రమాలకు వాడతామని ఓలీ ఇదివరకే చెప్పారని మోడీ గుర్తుచేశారు. పెట్రోలియం పైప్​లైన్​ నిర్మాణం నేపాల్​ చరిత్రలోనే గొప్ప విజయమని కేపీ శర్మ ఓలి అన్నారు. ఈ ప్రాజెక్టు.. సౌత్​ఏషియాలోని మిగతా దేశాలకూ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

పెట్రోలియం పైప్​లైన్ విశేషాలివే

పైప్​లైన్​ పొడవు 60 కిలోమీటర్లు. రూ.324 కోట్ల ఖర్చుతో ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​ లిమిటెడ్​(ఓఎన్​జీసీ), నేపాల్​ ఆయిల్​ కార్పోరేషన్​ లిమిటెడ్​(ఎన్​ఓసీఎల్​) జాయింట్​గా నిర్మించాయి. దీనికి ఆర్మీ ఆధ్వర్యంలో సెక్యూరిటీ కల్పిస్తారు. పైప్​లైన్​కు అనుబంధంగా నేపాల్​వైపు రూ.75 కోట్లతో స్టోరేజీ ఫెసిలిటీని నిర్మిస్తారు. 1973 నాటి ఒప్పందంతో ఇండియా నుంచి నేపాల్​కు ట్యాంకర్ల ద్వారా పెట్రోలియం ఉత్పత్తుల రవాణా జరిగేది. 1996లో పైప్​లైన్​ ప్రపోజల్​ వచ్చింది. 2014లో మోడీ కాట్మాండు పర్యటన సందర్భంలో పైప్​లైన్​ ప్రాజెక్టుపై రెండు దేశాలు సంతకం చేశాయి. ఇప్పుడది అందుబాటులోకి రావడంతో రవాణా ఖర్చులు తగ్గి, లీకేజీని పూర్తిగా అరికట్టినట్లవుతుంది. తద్వారా నేపాల్​కు రెండు బిలియన్​ డాలర్ల సొమ్ము ఆదా అవుతుంది.

PM Modi, K P Oli jointly inaugurate Motihari-Amlekhganj petroleum product pipeline