ఈజిప్టుకు చేరుకున్న ప్రధాని మోడీ.. 26 ఏళ్ల తర్వాత తొలిసారి

ఈజిప్టుకు చేరుకున్న ప్రధాని మోడీ.. 26 ఏళ్ల తర్వాత తొలిసారి

ప్రధాని నరేంద్ర మోడీ ఈజిప్టు చేరుకున్నారు.   కైరో ఎయిర్ పోర్టులో  ప్రధాని మోదీకి ఈజిప్ట్ ప్రధాని మోస్తఫా మడ్‌బౌలీ ఘన  స్వాగతం పలికారు. ఆలింగనం చేసి వెల్ కమ్ చెప్పారు.   ప్రధాని మోడీ గార్డ్ ఈజిప్టు  సేనల గౌరవ వందనం స్వీకరించారు. 1997 తర్వాత భారత ప్రధాని  ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి.

ALSO READ:బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అండర్ స్టాండింగ్ ఉందనుకుంటుండ్రు: రాజగోపాల్ రెడ్డి

ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఈజిప్టులో  రెండు రోజులు పర్యటించనున్నారు.   మొదటి రోజు ఈజిప్టు, పాలస్తీనాలో పోరాడి మరణించిన భారతీయ సైనికలకు నివాళి అర్పించనున్నారు.  వీరి కోసం హెలియోపొలిస్ కామన్ వెల్త్ వార్ గ్రేవ్ సిమెట్రీలో నిర్మించిన స్మారకాన్ని సందర్శించనున్నారు. రెండో రోజు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసితో రౌండ్ టేబుల్ సమావేశంలో  ప్రధాని మోడీ పాల్గొననున్నారు.