నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర మోడీ నివాళి

 నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర మోడీ నివాళి

ఢిల్లీలో 50వ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర 1971 యుద్ధంలో అమరులైన సైనికులకు నివాళులర్పించారు ప్రధాని మోడీ. అక్కడ అమరవీరుల స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆ నాటి యుద్ధవీరులకు యావత్ దేశం తరపున నమస్కరిస్తున్నానని అక్కడున్న విజిటర్స్ బుక్ లో రాశారు ప్రధాని. యుద్ధంలో మన సైనికులు చూపిన అసామాన ధైర్య సాహసాలు చూసి మన దేశ ప్రజలు గర్విస్తున్నారు. 50వ విజయ్ దివస్ సందర్భంగా, భారత సాయుధ బలగాల్లోని ముక్తిజోద్ధులు, బీరంగనాదులు మరియు ధైర్యవంతుల గొప్ప పరాక్రమాన్ని, త్యాగాన్ని మోడీ గుర్తుచేసుకుంటున్నాను. కలిసికట్టుగా పోరాడి అణచివేత శక్తులను ఓడించారన్నారు. ఢాకా పర్యటనలో రాష్ట్రపతి ఉండటం ప్రతి భారతీయుడికి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగించిన విషయమన్నారు.  మరోవైపు మూడు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ నేడు బంగ్లాదేశ్​కువెళ్లారు. ఢాకాలో నిర్వహించే 50వ 'విజయ్ దివస్' వేడుకల్లో ఆయన పాల్గొనున్నారు. ఈ వేడుకకు భారత్​ తరఫున గౌరవ అతిథిగా హాజరు కావాల్సిందిగా కోవింద్​ను బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ఆహ్వానించారు.