వరల్డ్ వైడ్ గా ఫేస్ బుక్ లో మోస్ట్ పాపులర్ లీడర్ గా ప్రధాని మోడీ నిలిచారు. ప్రముఖ గ్లోబల్ కమ్యునికేషన్ ఏజెన్సీ బీసీడబ్ల్యూ లేటెస్ట్ గా 2020 ఫేస్ బుక్ లో ప్రపంచ నాయకుల పేరుతో ఒక నివేదికను రిలీజ్ చేసింది. ఇందులో మన ప్రధాని మోడీ ఫేస్ బుక్ పేజీ 45 మిలియన్ల లైక్స్ తో టాప్ లో నిలిచింది. తర్వాతి స్థానంలో 27 మిలియన్ల లైక్స్ తో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఉన్నారు. 16.8 మిలియన్ లైక్స్ తో జోర్డాన్ క్వీన్ రానియా 3వ స్థానంలో ఉంది.

