విజయకాంత్‌ను తల్చుకుని మోదీ ఎమోషనల్

 విజయకాంత్‌ను తల్చుకుని మోదీ ఎమోషనల్

ఇటీవల మృతిచెందిన నటుడు,  డీఎంకే అధినేత విజయకాంత్ కు ప్రధాని మోదీ నివాళులర్పించారు. 2024 జనవరి 2 వ తేదీన  తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. అక్కడ  కెప్టెన్‌ విజయకాంత్‌ ను గుర్తుచేసుకోని భావోద్వేగానికి లోనయ్యారు. విజయకాంత్‌  సినీ ప్రపంచంలో మాత్రమే కెప్టెన్ కాదు.. రాజకీయ రంగంలో కూడా కెప్టెనే అంటూ ప్రసంశించారు. 

ఒక నేతగా రాజకీయం కంటే దేశ ప్రయోజనమే తనకు ముఖ్యమని విజయకాంత్ అనుకునేవారని తెలిపారు. విజయకాంత్ మరణం తమిళ భూమికి.. దేశానికి తీరని లోటు అని పేర్కొంటూ..  ఆయన  కుటుంబ సభ్యులకు, అభిమానులకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు తమిళనాడులో పర్యటించిన మోదీ..  పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా..  తిరుచిరాపల్లిలోని భారతిదశన్ యూనివర్సిటీలో స్నాతకోత్సవ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా మోదీ హాజరయ్యారు.  ఆ తర్వాత త్రిచీ ఎయిర్ పోర్ట్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన టెర్మినల్‌ను ప్రారంభించారు.

ఇక మరోవైపు అనారోగ్య సమస్యలతో భాదపడుతూ విజయకాంత్ 2023 డిసెంబర్ 28వ తేదీన మృతి చెందారు. సినీనటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా విజయకాంత్ తనదైన ముద్ర వేశారు.