
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం ఆయనకు నివాళులు అర్పించారు. ఆగష్టు 20, 1944న రాజీవ్ గాంధీ ముంబైలో జన్మించారు. ఆయన తన 40 ఏళ్ల వయసులో 1984 అక్టోబర్‌లో ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. దాంతో అత్యంత చిన్న వయసులో ప్రధాని పదవి చేపట్టిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు.
రాజీవ్ గాంధీ 1989 డిసెంబర్ 2 వరకు ప్రధానిగా పని చేశారు. మే 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్‌టీటీఈ) జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ మృతి చెందారు. రాజీవ్ గాంధీ పుట్టిన రోజును కాంగ్రెస్ పార్టీ ‘సద్భావన దివాస్’ గా పాటిస్తుంది.
For More News..