లత మరణం గురించి చెప్పలేని వేదనలో ఉన్నాను

లత మరణం గురించి చెప్పలేని వేదనలో ఉన్నాను

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోడీ, దేశ ప్రథమ పౌరుడు (రాష్ట్రపతి) రామ్ నాథ్ కోవింద్ సానుభూతి తెలిపారు. ఆమె నుంచి తాను అపారమైన ప్రేమను పొందనని ప్రధాని మోడీ అన్నారు. ఆమెతో తాను గడిపిన క్షణాలు మరచిపోలేనివని ఆయన అన్నారు. లత వివిధ రకాల ఎమోషన్స్ తో పాటలు పాడి అందరినీ ఆకట్టుకునేదని మోడీ చెప్పారు. సినిమాలకు అతీతంగా.. దేశం పట్ల ఎప్పుడూ మక్కువ చూపేదని ప్రధాని తెలిపారు. లతా మంగేష్కర్ బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలని కోరుకునేదని మోడీ తెలిపారు. ఆమె మరణం గురించి తాను చెప్పలేని వేదనలో ఉన్నానని ఆయన అన్నారు. లత మరణం దేశానికి తీరనిలోటని ఆయన అన్నారు. రాబోయే తరాల కోసం ఆమె భారత సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తుందని మోడీ చెప్పారు.

లతాజీ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది హృదయాలను కలిచివేసిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. ఆమె తన పాటలతో దేశం యొక్క అందాన్ని, భావోద్వేగాలను తెలియజేశారని ఆయన అన్నారు. లతాజీ సాధించిన విజయాలు సాటిలేనివిగా మిగిలిపోతాయని కోవింద్ కొనియాడారు. లతా మంగేష్కర్ అసాధారణమైన వారిలో ఒకరని ఆయన అన్నారు. ఆమె స్వరం మూగబోవొచ్చు కానీ, ఆమె పాటలు మాత్రం శాశ్వతంగా ప్రతిధ్వనిస్తాయని కోవింద్ అన్నారు.

For More News..